తెలంగాణలో నిత్యం వ్యతిరేక పోస్టర్లు (Posters) కలకలం రేపుతున్నాయి. బిఆర్ఎస్ (BRS) ను వ్యతిరేకిస్తూ బిజెపి (BJP), బిజెపి ని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్, అలాగే కాంగ్రెస్ (Congress) పార్టీల వ్యతిరేక పోస్టర్లు నిత్యం వైరల్ అవుతున్నాయి. తాజాగా బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ కు వ్యతిరేక పోస్టర్లు హైదరాబాద్ (Hyderabad) లో వెలిసాయి. ఈ పోస్టర్లలో బీఆర్ఎస్ అంటే డీల్ అని, తెలంగాణలో అతిపెద్ద ఎమ్మెల్యేల కొనుగోలుదారు అని రాసి ఉంది. ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ స్నాప్ డీల్ ని పోలిన లోగోతో బిఆర్ఎస్ డీల్, ఓఎల్ఎక్స్ లోగోను పోలిన సోల్డ్ ఎక్స్ అని అందులో రాసుకొచ్చారు.
మరోపక్క ప్రధాని మోడీ ఈరోజు తెలంగాణ లో పర్యటిస్తుండగా..ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిసాయి. ‘తెలంగాణ పుట్టుకను పదేపదే అవమానించిన ప్రధానికి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదు’ అంటూ పోస్టర్లను అతికించారు. ప్రధాని పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మాట్లాడిన మాటలను అందులో పేర్కొన్నారు. మొత్తం రెండు పార్టీల వ్యతిరేక పోస్టర్లు ప్రస్తుతం రాజకీయాల్లో చర్చ గా మారాయి.
Read Also : KCR vs Modi: మోడీ నుంచి తప్పించుకుంటున్న కేసీఆర్