Site icon HashtagU Telugu

Lok Sabha polls : మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం

postal ballot voting process will start from May 3

postal ballot voting process will start from May 3

Lok Sabha polls 2024: తెలంగాణ(Telangana)లో లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha polls) సమీపిస్తుండడంతో ఎలక్షన్ కమిషన్(Election Commission) అధికారులు ఏర్పాట్లపై దృష్టిసారించారు. ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ(Postal Ballot Voting Process) ప్రారంభించాలని యోచిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

సాధారణ పోలింగ్‌‌కు నాలుగు రోజుల ముందుగానే ఈ పక్రియను పూర్తి చేయాల్సి ఉండడంతో 8వ తేదీలోగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో ఈ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణను నెల 30న మొదలు పెట్టి రెండో తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికల సంఘం నిర్ణయించినట్టుగా పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను ఆయా జిల్లాల్లోనే ముద్రించనున్నాయి. కాగా ఈవీఎం యంత్రాలపై ఉంచే బ్యాలెట్‌ పత్రాలను హైదరాబాద్‌లోనే ముద్రించాలని అధికారులు నిర్ణయించారు.

Read Also: 1400 KG Gold Seized : 1400 కేజీల బంగారం సీజ్.. ఎవరిది ? ఎక్కడిది ?

85 ఏళ్లు దాటిన వయోవృద్ధులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. వృద్ధులతో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు, దివ్యాంగులు కూడా పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అవకాశం ఎంచుకున్న దివ్యాంగులు, వయోవృద్ధులు మాత్రమే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు రెండో దఫా శిక్షణ సందర్భంగా ఏర్పాటు చేసే ఫెసిలిటీ కేంద్రంలో ఓటు వేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు.

Read Also: Trump Hush Money Case: పోర్న్ స్టార్‌కు ట్రంప్ మనీ ఇచ్చాడా? ఈ రోజు తేల్చనున్న కోర్టు

తెలంగాణలో 85 ఏళ్ల వయసు దాటినవారు 4.50 లక్షల మంది ఉన్నట్లు అంచనాగా ఉంది. ఇక దివ్యాంగ ఓటర్లు సుమారు 5 లక్షలు, ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు 2.60 లక్షల మంది ఉద్యోగులు ఉంటారని అంచనాగా ఉంది. మరోవైపు రాష్ట్రానికి చెందిన 15 వేల మందికిపైగా ఉద్యోగులు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారికి రిజిస్టర్‌ పోస్టు ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌‌ను పంపాల్సి ఉంటుంది. దీంతో లోక్‌సభ ఎన్నికలకు సుమారు 13 లక్షల పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలను ముద్రించాలని అధికారులు నిర్ణయించారు.