Singer Jayaraj : ప్రముఖ కవి జయరాజ్‌కు గుండెపోటు.. నిమ్స్‌లో అత్యవసర చికిత్స

మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన జయరాజ్‌ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించి కవిగా పేరు తెచ్చుకున్నారు.

  • Written By:
  • Publish Date - July 20, 2024 / 12:39 PM IST

Singer Jayaraj : ప్రముఖ కవి, గాయకుడు జయరాజ్‌ శనివారం ఉదయం గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన జయరాజ్‌ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించి కవిగా పేరు తెచ్చుకున్నారు. మహబూబాబాద్‌ మండలం గుమ్మనూర్‌ లో గోడిశాల చెన్నమ్మ, గొడిశాల కిష్టయ్య దంపతులకు ఆయన  జన్మించారు. పేద దళిత కుటుంబానికి చెందిన జయరాజ్(Singer Jayaraj) వివక్ష లేని సమ సమాజం కోసం తన సాహిత్యాన్ని క్రియేట్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join

అడవిలో అన్న సినిమాలోని ‘వందనాలమ్మ పాట’ జయరాజ్ రాసిందే. దండోరా సినిమాలోని కొండల్లో కోయిల పాటలు పాడాలి అనే పాట కూడా ఆయన రచించిందే.  జయరాజ్ రాసిన ‘జోలాలీ’ పాటవింటే వందకోట్ల భారతీయుల కన్నీటి కథ మన ఎదుట సాక్షాత్కారం అవుతుంది. తన స్నేహితుడు చేరాల కనుమూసినపుడు ‘ నిన్నెట్టా మరిచిపోదును చేరాల’’ అనే పాటను జయరాజ్ రాశారు. కాచినపల్లి ఎన్‌కౌంటర్‌ పై జయరాజ్ రాసిన పాట ప్రతి హృదయాన్ని కదిలించింది. తెలంగాణ ప్రజల బతుకులు ఛిధ్రమైన తీరును జయరాజ్ తన సాంగ్స్‌లో ప్రతిబింబించేలా చేయగలిగారు. ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే సాంగ్స్‌ను అందించారు.

Also Read :Megastar Viswambhara : విశ్వంభర టీజర్ ఎప్పుడు.. మెగా ఫ్యాన్స్ అదిరిపోయే అప్డేట్..!

జయరాజ్(Popular Poet) తెలంగాణ ఉద్యమ సమయంలో పల్లెల్లో తిరుగుతూ తన ఆటపాటలతో ప్రజల్లో ఉద్యమ భావజాలాన్ని రగిలించారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం 2023లో కాళోజీ నారాయణ రావు అవార్డుతో ఆయనను సత్కరించింది. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం ఆయన పలు పాటలు రాశారు. మనిషికీ ప్రకృతికీ ఉన్న అవినాభావ సంబంధాన్ని తన సాహిత్యం ద్వారా ఆయన చక్కగా విశ్లేషించారు. ఈ అంశాలపై జయరాజ్ రాసిన పుస్తకాలు ఎంతో ప్రజాదరణ పొందాయి.

Also Read :Trivikram Allu Arjun Movie : కథ కాదు కాన్సెప్ట్.. త్రివిక్రమ్ అల్లు అర్జున్ ఏదో పెద్ద ప్లానింగే..!

Follow us