Ponnam Prabhakar : కరీంనగర్‌లోని కాంగ్రెస్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పత్రికా సమావేశంలో పాల్గొని పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే నిర్వహించామని, సర్వేలో పాల్గొనని వారికోసం మరో అవకాశం కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇది రీసర్వే కాదని, కేవలం మిస్సైన వారికోసమేనని స్పష్టత ఇచ్చారు. సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ నేతలకు ఈ అంశంపై మాట్లాడే అర్హత లేదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Prabhas Movie : ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో నటించాలి అనుకుంటున్నారా? ఈ ఛాన్స్ మీకోసమే..
బీసీ ముస్లింలపై బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతోనేనని పొన్నం ప్రభాకర్ ఆక్షేపించారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన పార్టీ బీజేపీయేనని గుర్తుచేశారు. కులగణన అంశంపై బీజేపీ తీసుకుంటున్న వైఖరిని ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. సర్వే ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఎన్నికలు జరుగుతాయని ఆయన స్పష్టతనిచ్చారు.
బీఆర్ఎస్‌లో మూడు కీలక పదవుల్లో ఒకదాన్ని బీసీలకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ నుండే ఈ డిమాండ్‌ను పెద్ద ఉద్యమంగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాలను పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉంటే అన్ని రాజకీయ పార్టీలు సర్వేలో పాల్గొనాలని సూచించారు. బీజేపీ తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని విమర్శించారు. పొన్నం ప్రభాకర్ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
Kalvakuntla Kavitha: జగిత్యాల సీటుపై కవిత ఫోకస్.. టార్గెట్ అసెంబ్లీ