పొన్నం ప్రభాకర్ గతంలో 2009లో కరీంనగర్ నుంచి ఎంపీగానూ గెలిచారు. ఇక ఇప్పుడు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఈయన కు బీసీ సంక్షేమశాఖ బాధ్యతలను కాంగ్రెస్ అప్పగించింది.
పొన్నం ప్రభాకర్ 1967, మే 8న సత్తయ్య – మల్లమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ లో జన్మించాడు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ, ఎల్.ఎల్.బి. పూర్తిచేశాడు. 1987-1988 మధ్యకాలంలో ఎస్.ఆర్.ఆర్. గవర్నమెంట్ డిగ్రీ, పీజీ కళాశాలలో చదువుకునే రోజుల్లో నుండి, ఒక విద్యార్థి నాయకుడుగా, యూనియన్ అధ్యక్షుడుగా పనిచేశాడు.
We’re now on WhatsApp. Click to Join.
1987-1989 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలందించాడు. 1987-1988 మధ్యకాలంలో కరీంనగర్ జిల్లా కళాశాలల కన్వీనర్ గా పనిచేశాడు. 1989-1991 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర కార్యదర్శి పదవిని, 1992-1998 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టాడు. 1999-2002 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2002-2003 మధ్యకాలంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ యొక్క ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు. 2002-2004 మధ్యకాలంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా సెల్ సమన్వయకర్తగా పనిచేశాడు.
2004-2009 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ గా పనిచేసారు. 2009లో లోక్ సభకు పోటీచేసే వరకు డి.సి.ఎం.ఎస్. అధ్యక్షుడుగా, మార్కుఫెడ్ విదేశాంగ ఛైర్మన్ గా చేశాడు. భారత జాతీయ కాంగ్రెస్ తరపున 2009 లో 15వ లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం ఎం.పి.గా ఎన్నికయ్యాడు. 2018 సెప్టెంబరులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే గా విజయం సాధించారు.
Read Also : Ponguleti Oath as Telangana Minister : మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి