Site icon HashtagU Telugu

Telangana Congress : గాంధీభ‌వ‌న్ లో టీపీసీసీ నిర్వాకంపై ర‌చ్చ

Ponnala Revanth

Ponnala Revanth

ఏఐసీసీ అధ్య‌క్ష ఎన్నిక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్ర‌మ‌శిక్ష‌ణారాహిత్యాన్ని బ‌య‌ట‌పెట్టింది. గాంధీభ‌వ‌న్ లో జ‌రుగుతోన్న పోలింగ్ సంద‌ర్భంగా ఓట‌ర్ల పేర్లు తారుమారు కావడం చ‌ర్చ‌నీయాంశం అయింది. రాత్రిరాత్రి ఓట‌ర్ల పేరు గోల్ మాల్ జ‌ర‌గ‌డంపై మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల ల‌క్ష్మయ్య ఆగ్ర‌హించారు. ఎవ‌రిష్టం వ‌చ్చిన‌ట్టు వాళ్లు చేసుకోవ‌డానికి కాంగ్రెస్ పార్టీ లేద‌ని ఫైర్ అయ్యారు. ఆయ‌నకు స‌ర్దిచెప్ప‌డానికి మాజీ మంత్రి జానారెడ్డి ప్ర‌య‌త్నించారు. కానీ, జ‌రిగిన త‌ప్పును మాత్రం స‌రిదిద్దలేని ప‌రిస్థితుల్లో సీనియ‌ర్లు ఉండ‌డం గ‌మ‌నార్హం.

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ఎన్నిక కోసం పోలింగ్ జ‌రుగుతోంది. సాయంత్రం నాలుగు గంట‌ల వ‌ర‌కు పోలింగ్ నిర్వ‌హిస్తారు. సంస్థాగ‌తంగా గాంధీయేత‌ర అధ్య‌క్షుని ఎన్నుకోవ‌డానికి కొన్ని ద‌శాబ్దాల జ‌రుగుతోన్న ఎన్నిక ఇది. జీ 23 లీడ‌ర్ల‌లో ఒక‌రైన‌ శ‌శిథరూర్ , గాంధీ కుటుంబ మ‌ద్ధ‌తుదారు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే ప్ర‌ధానంగా పోటీలో ఉన్నారు. వాళ్లిద్ద‌రిలో ఒక‌ర్ని ఎన్నుకోవ‌డం కోసం సోమ‌వారం పోలింగ్ జ‌రుగుతోంది. అందుకోసం డెలిగేట్ల జాబితాను ఆయా రాష్ట్రాలు త‌యారు చేశాయి. వాళ్ల‌కు ఓటు హ‌క్కును క‌ల్పిస్తూ ఐడీ కార్డుల‌ను ఇష్యూ చేశారు. నామినేటెడ్ డెలిగేట్ల‌కు ఓటు హ‌క్కు ఇవ్వ‌కుండా డెలిగేట్ల‌కు మాత్రమే ఇచ్చారు.

Also Read:   KTR on Modi: మోడీకి అస్కార్ కాకపోయినా, భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే!

తెలంగాణ రాష్ట్రంలో సుమారు 238 మంది డెలిగేట్లు ఉన్నారు. మ‌రో 38 మంది డెలిగేట్లు నామినేడెట్ గా ఉన్న‌ట్టు జాబితా ఆదివారం వెలువ‌డింది. ఆ మేర‌కు ఐడీ కార్డుల‌ను కూడా పీసీసీ ఇష్యూ చేసింది. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఎంపిక చేసిన డెలిగేట్ల‌కు మాత్ర‌మే ఓటు హ‌క్కు ఉంది. జ‌న‌గాం నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల‌, శ్రీనివాస‌రెడ్డి అనే మ‌రో సీనియ‌ర్ లీడ‌ర్ కు ఓటు హ‌క్కును క‌ల్పిస్తూ జాబితా విడుద‌ల అయింది. అయితే, ఆదివారం రాత్రి అదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నామినేటెడ్ డెలిగేట్ ప్ర‌తాప్ రెడ్డికి ఓటు హ‌క్కు క‌ల్పిస్తూ ఐడీ కార్డును పీసీసీ ఇష్యూ చేసింది. ఆ కార్డుతో ఓటు వేయ‌డానికి ప్ర‌తాప్ రెడ్డి సోమ‌వారం గాంధీభ‌వ‌న్ కు వ‌చ్చారు. అదే స‌మ‌యానికి శ్రీనివాస‌రెడ్డి కూడా చేరుకున్నారు. జాబితాలోని పేరు ప్ర‌కారం ఐడీ కార్డు శ్రీనివాస‌రెడ్డికి ఇవ్వాలి. కానీ, రాత్రిరాత్రి గోల్ మాల్ జ‌రిగింది. దాన్ని ప్ర‌శ్నిస్తూ పీసీసీ వాల‌కంపై పొన్నాల్ ఫైర్ అయ్యారు.

ఎన్నిక‌ల అధికారుల దృష్టికి ఈ స‌మాచారాన్ని పొన్నాల , జానా తీసుకెళ్లారు. మ‌ధ్యేమార్గంగా ఇద్ద‌రికీ ఓటు హ‌క్కును క‌ల్పిస్తారా? ప్ర‌తాప్ రెడ్డి ఐడీ కార్డును ర‌ద్దు చేసిన శ్రీనివాస‌రెడ్డికి ఇస్తారా? ఐడీ కార్డ్ ఇచ్చిన ప్ర‌కారం కేవ‌లం ప్ర‌తాప్ రెడ్డికి ఓటు వేయ‌డానికి అవ‌కాశం ఇస్తారా? జాబితాను అనుస‌రిస్తారా? అనేది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో హీటెక్కిస్తోంది.

Also Read:   Munugode : మునుగోడు బీజేపీ ప్ర‌చారంలోకి మాజీ ఎంపీ బూర‌