కాంగ్రెస్ మాజీ నేత పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) కు రాహుల్ (Rahul) ఆఫీస్ నుండి ఫోన్ కాల్ వచ్చిందనే వార్త రాజకీయాల్లో చర్చ గా మారింది. కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో దశాబ్దాల కాలంగా పనిచేస్తున్న పొన్నాల..రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి కేసీఆర్ (KCR) సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. పొన్నాల పార్టీ ని వీడడం ఫై కాంగ్రెస్ నేతలు తప్పుపట్టారు. పొన్నాల తొందర పడ్డారని..అసలు ఆయనకు టికెట్ ఇవ్వరని ఎలా అనుకున్నారని పలువురు సీనియర్స్ కామెంట్స్ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ తరుణంలో రాహుల్ ఆఫీస్ నుండి పొన్నాలకు ఫోన్ కాల్ వచ్చిందని , ఢిల్లీ కి వచ్చి రాహుల్ ను కలవాలంటూ ఆయనకు ఫోన్ చేశారనే వార్తలు వైరల్ అవ్వడం తో..మళ్లీ కాంగ్రెస్ లో చేరతారా అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ తరుణంలో రాహుల్ ఫోన్ కాల్ ఫై పొన్నాల స్పందించారు.
నాకు ఎవరూ ఫోన్ చేయలేదు. తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాను. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ సేవ చేసిన పార్టీలో అనేక అవమానాలు భరించి.. నేను ఓ రాజకీయ నిర్ణయం తీసుకున్నాను. బీసీలను చీడ పురుగులు చూసినట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తన ఉంది. ఇలాంటి చిల్లర ప్రచారాలకు ప్రభావితం అయ్యే వ్యక్తిని కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.
Read Also : PM Modi : షిర్డీ సాయికి ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని మోడీ