Ponnala as Jangaon BRS Candidate : జనగాం బీఆర్ఎస్ అభ్యర్థిగా పొన్నాల..?

పొన్నాల లక్ష్మయ్య..జనగాం బరిలో బిఆర్ఎస్ నుండి పోటీ చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది.

Published By: HashtagU Telugu Desk
ponnala Jangaon BRS Candidate

ponnala Jangaon BRS Candidate

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Election) పోలింగ్ కు రెండు నెలల సమయం కూడా లేకపోవడం తో అన్ని పార్టీలు మరింత స్పీడ్ అవుతున్నాయి. తమ తమ అభ్యర్థులతో విస్తృతంగా ప్రచారం చేయించేలా పార్టీ అధిష్టానాలు ప్లాన్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగానే నేతల వలసలు మాత్రం తలనొప్పిగా మారుతున్నాయి. అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) తో పాటు ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ (Congress) , బిజెపి (BJP) లకు సైతం అలాగే ఉంది. ఎవరు ఎప్పుడు పార్టీ మారతారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నాయి. గత కొద్దీ రోజులుగా వరుసగా నేతలు కాంగ్రెస్ లో చేరుతుండడం తో కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది..ఈ క్రమంలో పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పార్టీకి రాజీనామా (Ponnala Lakshmaiah Resigns from Congress Party) చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ లా మారింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో సేవలు అందిస్తున్న పొన్నాల లక్ష్మయ్య పార్టీ కి రాజీనామా చేయడం కార్యకర్తలు , నేతలు తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈయన కార్ ఎక్కేందుకు సిద్దమయ్యాడు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah)..జనగాం (Jangaon Constituency ) బరిలో బిఆర్ఎస్ నుండి పోటీ చేయబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు జనగాం అభ్యర్థిని ప్రకటించలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో లక్ష్మయ్యను జనగాం బీఆర్ఎస్ అభ్యర్థి (Jangaon BRS Candidate) గా పోటీకి దించే అవకాశం ఉందన్న ప్రచారం నడుస్తుంది. ఒకవేళ కుదరని పక్షంలో ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఆఫర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. పొన్నాలను గులాబీ గూటికి చేర్చడంలో బీఆర్ఎస్ దాసోజు శ్రవణ్, కేశవరావు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దాసోజు శ్రవణ్‌ నిన్న రాత్రే పొన్నాలను కలిసి చర్చించినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ రోజు ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ పొన్నాలకు జనగాం టికెట్ ఇస్తే ఇన్ని రోజులు జనగామ టికెట్ కోసం ట్రై చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి పరిస్థితి ఏంటన్న చర్చ బిఆర్ఎస్ లో మొదలైంది. మరి జనగాం టికెట్ పొన్నాలకా..పల్లా రాజేశ్వర్ రెడ్డి కా అనేది చూడాలి.

Read Also : CM KCR: మంత్రి వేముల తల్లి మంజులమ్మ భౌతికకాయానికి సీఎం కేసీఆర్‌ నివాళి

  Last Updated: 13 Oct 2023, 04:03 PM IST