కర్ణాటక(Karnataka) ఇచ్చిన జోష్ తో తెలంగాణ(Telangana)లో ఎలాగైనా బలపడి అధికారంలోకి రావాలని కాంగ్రెస్(Congress) చూస్తుంది. కానీ కాంగ్రెస్ లో విబేధాలు ఎక్కువగా ఉన్నాయి. కేటీఆర్(KTR) అసెంబ్లీలో కాంగ్రస్ వాళ్ళని అన్నట్టు నలుగురు నాయకులు కలిసి ఉండలేరు, కలిసి ఒక మాట మీద నిలబడలేరు అన్నట్టు ఎవరికి వాళ్ళు కష్టపడుతున్నారు తప్ప అందరూ కలిసి మాత్రం నడవట్లేదు. తెలంగాణ కాంగ్రెస్ లో విబేధాలు ఎక్కువగా ఉన్నాయని అందరికి తెలిసిందే. ఇదే వేరే పార్టీలకు ప్లస్ అవుతుంది.
తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లో విబేధాలు మరోసారి బయటపడ్డాయి. జనగామ డీసీసీ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమించడంపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) అసంతృప్తి వ్యక్తం చేస్తూ నేడు ఢిల్లీలో రాహుల్ ని కలిశారు.
తనను సంప్రదించకుండానే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమించారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏఐసీసీకి, రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు పొన్నాల లక్ష్మయ్య. పలుపార్టీలు మారి వచ్చిన స్థానికేతరుడికి డీసీసీ పదవి ఇచ్చారని, కాంగ్రెస్ మార్గదర్శకాల ప్రకారం జిల్లాకు చెందిన వ్యక్తికే పదవి ఇవ్వాలని పొన్నాల ఆరోపించారు.
అలాగే.. బీసీ నేతలకు ప్రాధాన్యత లేకపోగా, తీవ్ర అవమానాలకు గురి చేస్తున్నారని, రాష్ట్రంలో మొత్తం 35 డీసీసీల్లో ఓబీసీలకు కేవలం 6 మాత్రమే ఇచ్చారని, అగ్రవర్ణాలకు ఏకంగా 22, ఎస్సీలకు 3, ఎస్టీలకు 2, మైనారిటీలకు 2 ఇచ్చారని తెలిపి బీసీలకు తగినంత ప్రాతినిథ్యం కలిపించాలని రాహుల్ గాంధీని కోరినట్టు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. దీంతో మరోసారి తెలంగాణ కాంగ్రెస్ లో విబేధాలు బయటకు వచ్చాయి.
Also Read : HMDA Artificial Demond : జనం భూములు కేసీఆర్ ఇష్టం.! వేలంలో కృత్రిమ డిమాండ్!!