భార‌త్ బంద్ పై మాట‌ల యుద్ధం.. రేవంత్ వ‌ర్సెస్ సుధాక‌ర్ రెడ్డి

భార‌త్ బంద్ పై రాజ‌కీయ నేత‌ల మాట‌ల యుద్ధం మొద‌లైంది. ఈనెల 27న విప‌క్షాలు భార‌త్ బంద్ కు పిలుపు ఇచ్చిన విష‌యం విదిత‌మే. ఆ రోజున దేశ వ్యాప్తంగా పెరిగిన ధ‌ర‌లు, ప‌బ్లిక్ కంపెనీల అమ్మ‌కాలు, వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా విప‌క్ష నేత‌లు నిన‌దించ‌బోతున్నారు.

  • Written By:
  • Publish Date - September 24, 2021 / 02:32 PM IST

భార‌త్ బంద్ పై రాజ‌కీయ నేత‌ల మాట‌ల యుద్ధం మొద‌లైంది. ఈనెల 27న విప‌క్షాలు భార‌త్ బంద్ కు పిలుపు ఇచ్చిన విష‌యం విదిత‌మే. ఆ రోజున దేశ వ్యాప్తంగా పెరిగిన ధ‌ర‌లు, ప‌బ్లిక్ కంపెనీల అమ్మ‌కాలు, వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా విప‌క్ష నేత‌లు నిన‌దించ‌బోతున్నారు. అంత‌కంటే ముందుగా బీజేపీ,కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య రాజ‌కీయ మాట‌ల యుద్ధం మొద‌లైంది.
తెలంగాణ‌కు చెందిన పొంగులేని సుధాక‌ర్ రెడ్డి బీజేపీ త‌మిళ‌నాడు ఇంచార్జిగా ఉన్నారు. ఆయ‌న త‌మిళ‌నాడు నుంచి రేవంత్ పై విమ‌ర్శ‌ల‌ను ఎక్కు పెట్టారు. బంద్ కు పిలుపు నిచ్చిన కాంగ్రెస్, క‌మ్యూనిస్ట్ పార్టీలపై విరుచుకుప‌డ్డారు. యూపీఏ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ కాంగ్రెస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ మాదిరిగా దేశాన్ని దోచుకుంద‌ని గుర్తు చేశారు. ఆల్ ఇండియా క‌మ‌ర్షియ‌ల్ పార్టీగా కాంగ్రెస్ ను సుధాక‌ర్ రెడ్డి వ‌ర్ణించారు. ఇక క‌మ్యూనిస్ట్ లు క‌మ‌ర్ష‌య‌లిస్ట్ ల‌ను ఆరోపించారు. భార‌త్ కోసం నికార్సుగా సేవ చేస్తోన్న మోడీని విమ‌ర్శించే అర్హ‌త పీసీసీ చీఫ్ రేవంత్‌, క‌మ్యూనిస్ట్ ల‌కు లేద‌ని అన్నారు.
ఇక పంజాబ్ కాంగ్రెస్ లో ముస‌లం ఇప్పుడు బీజేపీ పార్టీకి క‌లిసి వ‌చ్చింది. అమ‌రేంద్ర‌సింగ్ పై న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ విమ‌ర్శ‌లు, సిద్ధూ పై సింగ్ ఆరోప‌ణ‌లు అక్క‌డి కాంగ్రెస్ పార్టీని రోడ్డున ప‌డేశాయి. ఆ క్ర‌మంలో అమ‌రేంద్రను ముఖ్య‌మంత్రిగా తొల‌గించ‌డం జ‌రిగింది. ఇదే విష‌యాన్ని ఇప్పుడు సుధాక‌ర్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. సిద్దూపై అమ‌రేంద్ర సింగ్ చేసిన ఆరోప‌ణ‌ల‌కు రేవంత్ స‌మాధానం చెప్పాల‌ని నిల‌దీశారు. మొత్తం మీద ఇందిరాపార్కు వేదిక‌గా భార‌త్ బంద్ అంశాన్ని ప్ర‌స్తావించిన రేవంత్ అండ్ టీం కు సుధాక‌ర్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. దీనికి రేవంత్ ప్ర‌తిస్పంద‌న ఎలా ఉంటుందో చూద్దాం.