Site icon HashtagU Telugu

Ponguleti Srinivasa Reddy : సాక్ష్యాధారాలతో యాక్షన్‌ లోకి దిగుతున్నామంటూ పొంగులేటి హెచ్చరిక

Srinu Warning

Srinu Warning

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) చేసిన తాజా వ్యాఖ్యలు (Ponguleti Srinivasa Reddy Comments) రాజకీయాల్లో హాట్ టాపిక్ (Politics Hot Tapic) గా మారడమే కాదు సంచలనం సృష్టిస్తున్నాయి. రెండు , మూడు రోజుల్లో రాజకీయాల్లో బాంబులు పేల్చబోతున్నామని, తప్పు చేసిన వారు..ఎవరు తప్పించుకోలేరని , ఎంతటి వాళ్లైనా తప్పు చేస్తే కఠిన శిక్షలు తప్పవని , సాక్ష్యాధారాలతో ఫైళ్లన్నీ సిద్ధం చేశామని..వారంతా జైలు ఊసలు లెక్కపెట్టాల్సిందే అని హెచ్చరించారు. పొంగులేటి కామెంట్స్ విన్న వారంతా ఎవరిపై యాక్షన్ తీసుకోబోతున్నారు..? ఏ ఫైల్స్ వీరికి లభించాయి..? ఎవరి గురించి పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేసారు..? అని అంత మాట్లాడుకుంటున్నారు.

తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం (Phone Tapping, Dharani, Kaleswaram) అంశాలలో ప్రధాన నేతలపై చర్యలు తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పాడా..? కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు లను కాంగ్రెస్ టార్గెట్ చేయబోతుందా..? అంటూ అంత భావిస్తున్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలను కొందరు సీరియస్‌గా తీసుకుంటుండగా, మరికొందరు మాత్రం అవి రాజకీయ వ్యూహం కోణంలో చూస్తున్నారు. ముఖ్యంగా మూసీ నిర్వాసితుల ఆందోళన, హైడ్రా వ్యవహారం, రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి సమస్యలు ప్రస్తుతం చర్చలుగా నడుస్తున్న సమయంలో, ఈ వ్యాఖ్యలు ఆ చర్చల దృష్టిని మరలించడానికి Congress diversion politics చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు, ప్రియాంక గాంధీ నామినేషన్ సమయంలో వాడిన హెలికాఫ్టర్ తెలంగాణ ప్రభుత్వానిది అని, తెలంగాణ ప్రజల సొమ్ము ఎలా ఉపయోగిస్తున్నారనే అంశంపై సోషల్ మీడియాలో బీజేపీ, బీఆర్‌ఎస్ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో పొంగులేటి చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీస్తున్నాయి. అయితే, ఈ వ్యాఖ్యలు అధికార పార్టీపై ఆర్థిక, రాజకీయ దాడులు చేయడానికి లేదా ప్రజల దృష్టిని వేరే అంశాల నుండి మరలించడానికి మాత్రమేనా అని కూడా రాజకీయ వర్గాల్లో అనేక మంది వాదిస్తున్నారు. మరి రెండు రోజుల్లో ఏంజరుగుతుందో చూడాలి.

Read Also : World Polio Day 2024 : నిండు జీవితానికి రెండు చుక్కలు