కాంగ్రెస్ అధిష్టానం (Congress high Command) ఫై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) అసంతృప్తితో ఉన్నారా..? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది. ఖమ్మం జిల్లా (Khammam District)లో కీలక నేతగా , అభిమాన నాయకుడిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి గుర్తింపు ఉంది. అలాంటి నేత కాంగ్రెస్ లో చేరడం తో ఖమ్మం జిల్లా వాసులంతా ఆయనకే జై కొట్టారు. ఇతర పార్టీ నేతలతో పాటు ఆయన అనుచరులు సైతం ఆయన వెంట అడుగులేశారు. ఈ క్రమంలో అధిష్టానాన్ని తన అనుచరులకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని కోరారు. దీనికి అధిష్టానం సైతం ఓకే చెప్పింది. కానీ ఆ తర్వాత అంత మారిపోయింది. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ లోకి వలసల పర్వం మొదలైంది. తుమ్మల వంటి సీనియర్ నేత తో పాటు చాలామంది కాంగ్రెస్ (Congress) గూటికి చేరారు. ఈ క్రమంలో పొంగులేటి అనుచరులకు టికెట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ కి కత్తిమీద సాము అయ్యింది.
We’re now on WhatsApp. Click to Join.
మొదటి లిస్ట్ లో తుమ్మల (Thummala) , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ల పేర్లు లేకపోవడం అంత ఖంగారు పడ్డారు. ఆ తర్వాత నిన్న ప్రకటించిన లిస్ట్ (Congress 2nd List) లో వారి తో పాటు చాలామందికి టికెట్ ఖరారు చేసి ఉపశమనం కల్పించారు. అయితే పొంగులేటి కోరిన టికెట్స్ మాత్రం ఖరారు చేయకపోయేసరికి ఆయన కాస్త అసంతృప్తి తో ఉన్నట్లు తెలుస్తుంది. రెండో జాబితాలో ఖమ్మం, పాలేరు, పినపాక సీట్లను ఖరారు చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఖమ్మం టికెట్ తుమ్మల నాగేశ్వర రావు, పాలేరు సీటును పొంగులేటి శ్రీనివాస రెడ్డికి కేటాయించారు. పినపాక సీటును పొంగులేటి ప్రధాన అనుచరుడు పాయం వెంకటేశ్వర్లుకు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్న.. ఇల్లందు, అశ్వారావుపేట, సత్తుపల్లి, వైరా టికెట్లను మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ 4 స్థానాల్లోనూ పొంగులేటి ముఖ్య అనుచరులు టికెట్ ఆశిస్తున్నారు. పొత్తుల్లో భాగంగా ఈ సీట్లలో ఒకటి లేదా రెండింటిని కమ్యూనిస్టులకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటె మరో నేత రేణుకా చౌదరి కూడా తన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని గట్టిగానే డిమాండ్ చేస్తుంది. ఈ నాలుగింటిలో రెండు స్థానాల్లో టికెట్లను తన అనుచరులకు ఇవ్వాలని కోరుతుంది. మరి పొంగులేటి అనుచరులకు టికెట్ ఇస్తారా..? లేక రేణుక అనుచరులకు ఇస్తారా అనేది ఆసక్తి గా మారింది.
Read Also : AP Volunteer : ఏలూరు జిల్లాలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసిన వాలంటీర్