తెలంగాణ (Telangana) రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఓ ఎత్తు..ఖమ్మం (Khammam) లో ఓ ఎత్తు అనేలా మారింది. మొదటి నుండి ఖమ్మం జిలాల్లో బిఆర్ఎస్ (BRS) కు పెద్దగా పట్టులేదు. ఇక్కడ గెలిచినా వారంతా ఇతర పార్టీలలో గెలిచి..ఆ తర్వాత బిఆర్ఎస్ లో చేరిన వారే..కానీ ఇప్పుడు వారంతా బరిలో దిగుతుండడం..మొన్నటి వరకు బిఆర్ఎస్ లో ఉన్న నేతలు బయటకు వచ్చి కాంగ్రెస్ (Congress) నుండి ఇప్పుడు పోటీ చేస్తుండడం తో ఖమ్మం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ఖమ్మంలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తి గా మారింది. ఎందుకంటే ఇద్దరు బడా నేతలు పోటీ పడుతున్నారు.
బిఆర్ఎస్ నుండి పువ్వాడ అజయ్ (Puvvada Ajay) పోటీ చేస్తుండగా..కాంగ్రెస్ నుండి తుమ్మల (Thummala) బరిలోకి దిగడం తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ ఇద్దరి పైనే కన్నేశారు. ఇద్దరి సీట్లు ఖరారైన దగ్గరి నుండి ఇద్దరు కూడా హోరాహోరీగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy)..పువ్వాడ ఫై ఫైర్ అయ్యారు. ఖమ్మంలో డబ్బును నమ్ముకొని గెలుస్తానాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కలలు కంటున్నారన్నారు. డబ్బు గెలుస్తుందా? కార్యకర్తలను నమ్ముకున్న తుమ్మల నాగేశ్వరరావు గెలుస్తారా ..? అనేది తేలాల్సి ఉందన్నారు. డబ్బు మదంతో కేసీఆర్ విర్రవీగుతున్నారని.. ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పొంగులేటి తెలిపారు. ఈ ఎన్నికల్లో 78 సీట్లతో కాంగ్రెస్ గెలవబోతుందని , డిసెంబర్ 9న కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారని పొంగులేటి జోస్యం చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆదివారం నేలకొండపల్లి మండల పరిధిలోని రాయిగుడెం,అప్పల నర్సింపురం, కట్టు కాచారం, కొంగర గ్రామాలలో పొంగులేటి పర్యటీంచారు. ఆయా గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం పథకాలను ప్రజలకు వివరించారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పథకాలను తెలియజేశారు. ఆయా గ్రామాల్లోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Read Also : Hyderabad Fire Accidents : హైదరాబాద్ లో పలుచోట్ల భారీ అగ్ని ప్రమాదాలు…కేటీఆర్ పర్యటన