Site icon HashtagU Telugu

Khammam Politics: వేడెక్కుతున్న ఖమ్మం, తుమ్మల ఇంటికి పొంగులేటి!

Khammam Politics

New Web Story Copy 2023 09 02t125909.912

Khammam Politics: తెలంగాణాలో మరికొద్ది రోజుల్లో ఎన్నికల భేరి మోగనుంది. ఇప్పటికీ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని ఎంపిక చేసే వేటలో పట్టాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ 2024 ఎన్నికల బరిలో దిగే 115 అభ్యర్థుల్ని ప్రకటించింది. తాజాగా సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి 115 మంది పేర్లను ప్రకటించారు. దీంతో పార్టీపై అనేకమంది అసహనం ప్రదర్శించారు. టికెట్ దక్కుతుందనుకుని భంగపడ్డ నేతలు ఇతర పార్టల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తమ అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించలేదు. మొన్నటివరకున్న ప్రజల్లో బలమైన పార్టీగా ముద్ర వేసుకున్న బీజేపీ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది . బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనన్న అనుమానాలు ప్రజల్లోనూ వ్యక్తమవుతున్నాయి. పైగా తాజాగా బీజేపీ అధ్యక్షుడిని మార్చడంతో తెలంగాణాలో బీజేపీ పూర్తిగా ప్రజల మద్దతుని కోల్పోయింది. ప్రస్తుతానికి అయితే తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యే బలమైన పోటీ కనిపిస్తుంది. ఇదిలా ఉంటే తెలంగాణాలో ఖమ్మం రాజకీయాలు చాలా స్పెషల్. కాంగ్రెస్ కంచుకోటగా ఖమ్మం రాజకీయాలు సాగుతున్నాయి.

ఖమ్మం(Khammam) జిల్లా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్‌లోకి పార్టీ నేతలు ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి… పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పుడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా కోరారు. అయితే ఖమ్మం జిల్లా ప్రజలు, అనుచరుల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటానని తుమ్మల స్పష్టం చేశారు.

Read More: ISRO Scientist  : ఇస్రో శాస్త్రవేత్త కావడం ఇలా.. ఏం చదవాలి ? ఎక్కడ చదవాలి ?

పొంగులేటి శ్రీనివాసరావు (Ponguleti Srinivas Rao)తుమ్మల ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే బీఆర్ ఎస్ లో చేరినట్లు పొంగులేటి తెలిపారు. కానీ, బీఆర్‌ఎస్…తమకు తెలియకుండా చాపకింద నీరులా రాజకీయాలు చేసిందని విమర్శించారు. ముందు నన్ను అవమానించారని.. ఇప్పుడు తుమ్మలను అవమానిస్తున్నారని అన్నారు. పార్టీని వీడేలా చేస్తున్నాడని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయని పొంగులేటి అన్నారు. ఖమ్మం నుంచే బీఆర్‌ఎస్ పతనం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామని పొంగులేటి అన్నారు.

తుమ్మల(Tummala Nageshwara Rao) కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాసరావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తుమ్మల రాక కోసం ఎదురుచూస్తోందన్నారు. అయితే పార్టీలో చేరాలనేది తుమ్మల ఒక్క నిర్ణయం కాదు. పార్టీ మారే విషయంలో కూడా తాను ఒక్క నిర్ణయం తీసుకోలేదని.. ప్రజలు, అనుచరులు, కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో దాని మేరకే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తన అనుచరుల అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుంటానని తుమ్మల తెలిపారు. రేవంత్ రెడ్డి కూడా వచ్చి పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు. ఈ విషయమై ప్రజలతో చర్చిస్తున్నట్లు తుమ్మల తెలిపారు. నిర్ణయం తీసుకునేందుకు తుమ్మల కొంత సమయం అడుగుతున్నారని పొంగులేటి తెలిపారు. కానీ, తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను అని అన్నారు.

తుమ్మల తన రాజకీయ జీవితాన్ని తన స్వార్థం కోసం కాకుండా ప్రజా సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నారని అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేశానన్నారు. అంతేకాదు ఏ పార్టీ కోసం కష్టపడ్డానో చెప్పుకొచ్చారు.సీతారామ ప్రాజెక్టు గోదావరి నీటి విడుదలను కళ్లారా చూడాలన్నదే లక్ష్యమని ఆ తర్వాత రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నదే తన కోరిక అని తుమ్మల తెలిపారు. ఆ ఆశయం కోసమే ఈ ఎన్నికల్లో నిలుస్తున్నట్లు చెప్పారు. అనుచరుల అభిప్రాయం మేరకే తన నిర్ణయాలు ఉంటాయని తుమ్మల స్పష్టం చేశారు.

Also Read: Moon To Mars : చంద్రుడి నుంచి మార్స్ పైకి మిషన్.. నాసా టీమ్ కు ఇండియన్ సారథ్యం