Ponguleti : దేశంలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే

Ponguleti : దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం లేదని, కానీ తెలంగాణలో మాత్రం తమ ప్రభుత్వం పేదల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Minister Ponguleti

Minister Ponguleti

Ponguleti : దేశంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం లేదని, కానీ తెలంగాణలో మాత్రం తమ ప్రభుత్వం పేదల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నిన్న వరంగల్ జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి, రాయపర్తి మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగాన్ని పూర్తిగా దిగజార్చిందని, ఇక రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో పేదల రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ జరుగుతోందని చెప్పారు. గత ప్రభుత్వాల వల్ల రేషన్ కార్డులు ఎన్నికల నాటికి మాత్రమే పరిమితమయ్యేవని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేస్తోందని మంత్రి తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నా రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రైతుల సంక్షేమం దృష్ట్యా భూభారతి చట్టం తీసుకువచ్చామని వివరించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. పార్టీ గెలుపుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ అండగా నిలుస్తుందని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నెరవేర్చుతుందని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు.

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు

  Last Updated: 01 Jul 2025, 11:42 AM IST