తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి పూర్వ వైభవం వస్తుందా..? అంటే ఖచ్చితంగా వస్తుందని అంటున్నారు పార్టీ శ్రేణులు. గత ఎన్నికలు టైం వేరు..ఇప్పుడు వేరు..అప్పటి నేతలు వేరు..ఇప్పటి నేతలు వేరు..అప్పటి బలం వేరు..ఇప్పటి బలం వేరు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు పార్టీ క్యాడర్. మరో రెండు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ చేసింది. ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తూనే..మరోపక్క పార్టీ లో అసమ్మతి సెగ ను తగ్గించే పనిలో ఉంది. ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున కీలక నేతలు చేరుతుండడం తో పార్టీ కి రోజు రోజుకు బలం పెరుగుతుంది. ఎన్నికల సమయం నాటికీ మరింతమంది కాంగ్రెస్ లో చేరబోతారని స్పష్టం చేస్తున్నారు. ఇదే జోష్ తో ఎన్నికలు పూర్తి అయ్యేవరకు కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ , ఖమ్మం కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) చిన్న ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
కాంగ్రెస్ లో చేరిన దగ్గరినుండి కొత్తగూడెం నుంచి పోటీకి సై అన్న పొంగులేటి తాజాగా పాలేరు నియోజకవర్గం (Paleru Constituency)పై దృష్టి సారించారని అంటున్నారు. సడెన్ గా ఆయన వ్యూహం ఎందుకు మారిందన్న అంశంపై ఖమ్మం జిల్లా రాజకీయ సర్కిల్స్ లో జోరుగా చర్చ సాగుతోంది. గతంలో కొత్తగూడెం నుంచి ప్రస్తుతం సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambasiva Rao) పోటీ చేసి గెలుపొందారు. అయితే.. సీపీఐ, కాంగ్రెస్ పొత్తు కుదిరితే ఆయన కొత్తగూడెం సీటును అడిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పొంగులేటి పాలేరులోనూ పోటీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు చర్చ నడుస్తుంది.
ఒకవేళ పొంగులేటి పాలేరులో పోటీ చేస్తే ఇటీవల పార్టీలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) పరిస్థితి ఏంటన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం మూడు జనరల్ స్థానాలు మాత్రమే ఉన్నాయి. అయితే.. పొంగులేటి ఈ మూడు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థిత్వాన్ని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం, కొత్తగూడెం , పాలేరు స్థానాల ఫై ఆయన ఫోకస్ చేస్తున్నారు. మొన్నటి వరకు కొత్తగూడెం నుండి అని చెప్పి..ఇప్పుడు పాలేరు , లేదంటే ఖమ్మం స్థానాలపై ఆలోచన చేయడం ఏంటి అని కొంతమంది మండిపడుతున్నారు.
ఏదో ఒకటి త్వరగా డిసైడ్ చేస్తే మిగతా రెండు స్థానాల్లో వేరే అభ్యర్థులను ప్రకటిస్తాం అన్నట్లు పార్టీ చెపుతోందట. కానీ తుమ్మల మాత్రం పాలేరు స్థానం ఫిక్స్ చేశాకే..కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు పాలేరు లేదనే పరిస్థితి ఆయనకు చెప్పారు. సో..పొంగులేటి ఖమ్మం , లేదా కొత్తగూడెం ఈ రెండు స్థానాల్లో నుండే పోటీ చేయాల్సి ఉంటుంది. మరి ఫైనల్ గా ఏ స్థానం ఫిక్స్ చేసుకుంటారో చూడాలి.
Read Also : Chandrababu Quash Petition : రేపు సుప్రీం కోర్ట్ లో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఫై విచారణ