Ponguleti Srinivas Reddy : డబ్బుల సంచులు ఇచ్చినంత మాత్రాన సత్తుపల్లి ప్రజలు మోసపోరు – పొంగులేటి

  • Written By:
  • Publish Date - November 18, 2023 / 02:43 PM IST

తెలంగాణ ఎన్నికల (TS Polls) సమయం దగ్గర పడుతున్న కొద్దీ అన్ని రాజకీయ పార్టీలు (Political Parties) మరింత స్పీడ్ అవుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇదే క్రమంలో పెద్ద ఎత్తున డబ్బుకూడా చేరుతుంది. ఎన్నికల పోలింగ్ కు ఇంకా పది రోజులకు పైగానే సమయం ఉన్నప్పటికీ..ఇప్పటి నుండే ఓటర్లను డబ్బుతో కొనేందుకు చూస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిలాల్లో ప్రజలు ఎవరికీ పట్టం కట్టబెడతారనేది ఆసక్తిగా మారింది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బిఆర్ఎస్ (BRS) అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి కూడా ఖమ్మం (Khammam) జిల్లాలో బిఆర్ఎస్ సత్తా చాటలేకపోయింది. ఇప్పుడు ఉన్న నేతలంతా కూడా ఇతర పార్టీల నుండి గెలిచి బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వారే..ఇప్పుడు డైరెక్ట్ గా బిఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నారు. దీంతో ప్రజలు నేతలను చూస్తారా..నేతల వెనుకాల ఉన్న పార్టీల ను చూసి ఓట్లు వేస్తారా అనేది ఆసక్తిగా మారింది. ముఖ్యంగా పాలేరు , ఖమ్మం , సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనేదాని గురించి జిల్లా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. పాలేరు నుండి పొంగులేటి vs ఉపేందర్ , ఖమ్మం లో తుమ్మల vs పువ్వాడ , సత్తుపల్లి లో సండ్ర vs మత్త రాగమయి లు పోటీ చేస్తున్నారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో గట్టి పోటీనే నెలకొంది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొనుగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని … 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం వీస్తుందన్నారు. అధికారంలో ఉన్న వ్యక్తికి హుజూరాబాద్ లో వందల కోట్లు ఖర్చు పెట్టిన అధికార పార్టీకి ఫలితం దక్కలేదని.. అక్కడ వచ్చిన ఫలితమే సత్తుపల్లి లో వస్తుందన్నారు. డబ్బుతో రాజకీయం చేయలేం..అది సాధ్యం కాదన్నారు. బడా బాబులు వచ్చి డబ్బుల సంచులు ఇచ్చినంత మాత్రాన సత్తుపల్లి ప్రజలు మోసపోరని తెలిపారు. కరోనా సమయంలో నీళ్ల ఇంజక్షన్ లు చేసి డబ్బులు పోగేసి ఆ డబ్బులు ఇప్పుడు ఖర్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలి? అని ప్రశ్నించారు. డబ్బుతో రాజకీయం చేయాలనుకోవడం మూర్ఖత్వమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగస్తులకు జనం మీదకు పంపి వాళ్ళను మార్చాలి అనుకోవటం అమాయకత్వమన్నారు. అలాగే సండ్ర ఫై కూడా పరోక్షంగా పొంగులేటి ఫైర్ అయ్యారు. సామాన్య ప్రజలను,చిన్న చిన్న వారిని పెట్టిన ఇబ్బందులు ఎవరు మర్చిపోరు..రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే ప్రభుత్వం ఎంటో అందరికీ తెలుసన్నారు. డిసెంబర్ 9 తరువాత తోత్తులకు, కబ్జాదారులు అర్థం అవుతుంది.. తెలంగాణ ప్రజల తీర్పు ఏంటో అని ధీమా వ్యక్తం చేశారు.

Read Also : Serilingampally Jagadeeshwar Goud : మచ్చ లేని మహారాజు ‘జగదీశ్వర్ గౌడ్’