Site icon HashtagU Telugu

Eruvaka Pournami : పంచె కట్టుతో దుక్కి దున్నిన మంత్రి పొంగులేటి

Psr Eruvaka

Psr Eruvaka

తెలుగు సంస్కృతిలో వ్యవసాయానికి కీలకమైన ఆరంభ దశ ఏరువాక (Eruvaka Pournami). ‘ఏరు ఉవ్వాక’ అనే పదబంధం నుంచి పుట్టిన ఈ పదానికి అర్థం.. మట్టిని తడిపి, దుక్కి దునికి సాగు మొదలుపెట్టడం. వర్షాకాలం ప్రారంభమైన తరువాత పౌర్ణమి నాడు జరుపుకునే ఈ ఉత్సవాన్ని ఏరువాక పౌర్ణమిగా పిలుస్తారు. ఈ రోజు రైతులు భూమికి నమస్కరించి, నాగలి పట్టి పొలాల్లో మొట్టమొదటి దుక్కి దున్నారు. భూమి పరమేశ్వరి అనే భావనతో ఈ పర్వదినాన్ని ఎంతో భక్తితో జరుపుకుంటారు.

Iran- Israel War: సామాన్యుల‌పై ధ‌ర‌ల భారం.. వీటి రేట్లు భారీగా పెరిగే ఛాన్స్‌!

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణలోని పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) కూసుమంచి మండల కేంద్రంలో సంప్రదాయ వేషధారణలో భాగంగా పంచె కట్టి, తలపాగా చుట్టుకొని నాగలి పట్టారు. విత్తనాలు చల్లడం ద్వారా ఆయన రైతులకు నూతన సాగు సీజన్‌కు శుభకాంక్షలు తెలియజేశారు. ఇది రైతులతో ప్రభుత్వాని అనుసంధానించే ఒక ప్రముఖ కార్యక్రమంగా మారింది.

White House : మేం పిలువలే.. పాకిస్తాన్ ఇజ్జత్ తీసిన అమెరికా..

ఏరువాక పౌర్ణమి రోజు గ్రామాల్లో పూజలు, సాంప్రదాయ నృత్యాలు, జానపద గీతాలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇది కేవలం వ్యవసాయారంభం మాత్రమే కాక, ప్రకృతితో మన సంబంధాన్ని గుర్తు చేసే ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుక కూడా. ప్రకృతి కరుణతో పంటలు బాగా పండాలని కోరుకుంటూ రైతులు ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు వచ్చినా, ఏరువాక పౌర్ణమి పట్ల భక్తి, నమ్మకం మాత్రం మారలేదు. ఇది రైతుల జీవితాల్లో కొత్త ఆశలు, ఆశయాలకు నాంది పలికే పండుగ.