మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కి కాంగ్రెస్ పార్టీ (Congress Party) భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. బిఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన పొంగులేటి..రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి ముందే ఆయన అధిష్టానం వద్ద కొన్ని కండిషన్లు పెట్టడం జరిగింది. ఖమ్మం జిల్లాలో తన అనుచరులకు కాంగ్రెస్ టికెట్స్ ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనికి కాంగ్రెస్ ఓకే చెప్పింది. కానీ ఆ తర్వాత పార్టీలో అనేక మార్పులు జరిగాయి. బిఆర్ఎస్ నుండే కాక ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ లో చేరడం తో కాంగ్రెస్ పార్టీ జోరు అందుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో పొంగులేటి కి హామీ ఇచ్చినట్లు ఆయన అనుచరులకు టికెట్స్ ఇవ్వలేకపోతుంది. ఇక ఇప్పుడు ఏకంగా పొంగులేటి సీటుకే ఎసరు పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. పొంగులేటి పోటీకి సిద్ధం అవుతున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ స్థానాన్ని పొత్తుల్లో భాగంగా సీపీఐకి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అయ్యింది. ఈ క్రమంలో పొంగులేటి ఖమ్మం అసెంబ్లీ స్థానం (Ponguleti Srinivas Reddy Contest Khammam) కేటాయించారు. కాంగ్రెస్ తో సీపీఐ, సీపీఎం పొత్తు దాదాపుగా కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. అందులో భాగంగా సీపీఐకి కొత్తగూడెం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ స్థానాలను , సీపీఎంకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, ఉమ్మడి నల్లగొండలోని మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉండడం తో..పొంగులేటికి ఖమ్మం స్థానాన్ని కేటాయించబోతున్నారు. అలాగే భద్రాచలం కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య కు పినపాక కు పంపించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారికంగా అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటిస్తే కానీ ఎవర్ని ఎక్కడినుండి బరిలోకి దింపుతున్నారనేది క్లారిటీ వస్తుంది.
Read Also : KCR : రేపు పులి బయటకు వస్తే..నక్కలన్నీ మళ్లా తొర్రలకే – కేటీఆర్