తెలంగాణ(Telangana)లో నిరుపేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం నిరంతరం సాగుతోందని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Srinivasreddy) వెల్లడించారు. మొత్తం నాలుగున్నర లక్షల ఇండ్లకు శ్రీకారం చుట్టామని, ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు కేటాయించినట్లు తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. “ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది. ఒకసారి ఇండ్లు ఇచ్చి చేతులు దులిపేసే ప్రభుత్వం కాదు మాది” అని పేర్కొన్నారు. ఈ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 22,500 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని తెలిపారు.
Google AI Edge Gallery : సరికొత్త యాప్ ను తీసుకొచ్చిన గూగుల్..ఇక వాటికీ నెట్ అవసరం లేదు
పేదల కంట కలిసే ఇల్లు కలను నిజం చేయడంలో తమ ప్రభుత్వం ఎలాంటి వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. రాబోయే మూడున్నరేళ్లలో తల తాకట్టు పెట్టైనా 20 లక్షల ఇండ్లు నిర్మిస్తాం అని మంత్రి పేర్కొన్నారు. అప్పుడే ప్రజల ముందుకు ఓట్లు అడగడానికి వెళ్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. అదే సమయంలో గత ప్రభుత్వానికి చెందిన నాయకులు ఇంటి పట్టాల పంపిణీ విషయంలో రెత్తుబంధును తమ పార్టీవారికే కేటాయించారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై వ్యాఖ్యలు చేస్తూ, అది పూర్తిగా కమీషన్ల కోసం చేపట్టిన బాగోతం అని ఆరోపించారు. “ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయకుండా కాళేశ్వరం కట్టడం వల్ల ప్రజల నష్టపోయారు. పైగా మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌కి దారి వేసేందుకు వాసాలమర్రి గ్రామాన్ని పాడుచేశారు” అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పారదర్శకంగా పనిచేస్తుందని, ప్రజలకు నిజమైన సంక్షేమం అందిస్తుందని చెప్పారు. వచ్చే పది సంవత్సరాలు కాంగ్రెస్ పాలన కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.