Site icon HashtagU Telugu

Ponguleti : మూడు రోజుల్లో నాపై ఐటీ దాడులు..ప్రచారంలో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

IT Raids On Ponguleti

Shock To Ponguleti

ఓ పక్క తెలంగాణ ఎన్నికల పోలింగ్ (Telangana Polls )సమయం దగ్గర పడుతున్న టైములో ఐటీ అధికారులు తెలంగాణ కాంగ్రెస్ నేతల ఇళ్ల ఫై , ఆఫీస్ లపై దాడులు (IT Rides) జరపడం సంచలనం రేపుతోంది. రెండు రోజుల క్రితం పలువురు నేతల ఇళ్ల లో దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)..ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ మరో రెండు , మూడు రోజుల్లో నాపై ఐటీ దాడులు జరగబోతాయి అని తెలిపి షాక్ ఇచ్చాడు.

We’re now on WhatsApp. Click to Join.

తాను ఏ రోజు తప్పు చేయలేదు. తప్పు చేయబోమని చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా తనపై ఏ రెయిడ్స్ చేసుకున్నా తమకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెట్టాలని చూస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అక్రమంగా కాజేసిన లక్ష కోట్ల ప్రజాధనాన్ని ఉపయోగించి ఈ ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ (KCR) చూస్తున్నారని, అయితే గెలుపు సాధ్యం కాదని తెలిసే కేంద్రంలోని బీజేపీ సర్కార్‌తో కలిసి కాంగ్రెస్ నేతలపై ఐటీ రైడ్స్ చేయిస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. తనతో పాటు రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును కేటీఆర్ టార్గెట్ చేయబోతున్నారని ఆరోపించారు.

ఇక పొత్తు కుదిరిన నేపథ్యంలో ఖమ్మం సీపీఐ కార్యాలయానికి పొంగులేటి వెళ్లి.. పొత్తు ధర్మంలో భాగంగా సీపీఐకి కేటాయించిన కొత్తగూడెంలో ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని , పాలేరులో తనకు సంపూర్ణ మద్దతును ప్రకటించి.. తనకు భారీ మెజారిటీ దక్కేలా కృషి చేయాలని కోరారు.

Read Also : BC Atma Gourava Sabha : బిజెపి -జనసేన కార్యకర్తలతో జనసంద్రంగా మారిన LB స్టేడియం