Site icon HashtagU Telugu

Tellam Venkata Rao: పొంగులేటి నాకు రాజకీయ గురువు.. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు

Tellam

Tellam

Tellam Venkata Rao: భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఇవాళ జూలూరుపాడు లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున టికెట్ రాకపోయినా ఏదో ఒకటి చేసి ఇతర పార్టీలో టిక్కెట్ సంపాదించుకొని గెలిచాను. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బొమ్మతో తాను భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచాను. పార్టీ లో లేకపోయినా దొంగ చాటుగా పొంగులేటి బొమ్మ పెట్టుకొని ప్రచారం చేశాను. తాను ఏ పార్టీలో ఉన్నా మనసు మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తోటే ఉండేది’’ అని కామెంట్స్ చేశారు.

‘‘నాకు రాజకీయ గురువు..నేను ఈ స్థాయికి రావడానికి కారణం మంత్రి పొంగులేటి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుస్తామంటుంటే తాను కూడా పొంగులేటి మనిషినే కాబట్టి పొంగులేటి అన్న విధంగానే పదికి పది స్థానాలు గెలుస్తాం అనుకునేవాడిని. పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. భద్రాచలం లో పొంగులేటి చేసిన సహాయం ,సేవా కార్యక్రమాలు తన గెలుపుకు దోహదం చేశాయి’’ అంటూ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు షాకింగ్ కామెంట్స్ చేశారు.

Exit mobile version