Ponguleti Srinivas Reddy : కష్టాల్లో పొంగులేటి..నమ్మొచ్చా..?

ఏపీ సీఎం జగన్ తో ఎక్కువ సాన్నిహిత్యం ఉండటంవల్ల వైసీపీ గెలుపు కోసం అభ్యర్థులకు డబ్బులు పంపిస్తున్నారని మీ ఫై ఆరోపణలు వస్తున్నాయి

  • Written By:
  • Publish Date - April 21, 2024 / 04:30 PM IST

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)..ఈయన తెలియని తెలుగువారు లేరు..కేవలం రాజకీయ నేతే కాదు టాప్ బిజినెస్ మాన్ కూడా. వేలకోట్ల ఆస్థిపరుడు. అలాంటి ఆయన నా వద్ద డబ్బులేవ్ ..కష్టాల్లో ఉన్నట్లు తెలిపి అందర్నీ ఆశ్చర్య పరిచాడు. 2014 లో వైసీపీ తరుపున ఖమ్మం ఎంపీ గా గెలుపొందిన ఆయన… తర్వాత ప్రాంతీయ రాజకీయ పార్టీ బిఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి)లోకి మారారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి లింగాల కమలరాజుకు మద్దతుగా నిలిచారు.

2023లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బీఆర్‌ఎస్ పార్టీ సస్పెండ్ చేశారు. తర్వాత 2023 జూలై 2న రాహుల్ గాంధీ సమక్షంలో ఖమ్మంలో జరిగిన ‘తెలంగాణ జన గర్జన’ బహిరంగ సభలో కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత ఖమ్మంలో కాంగ్రెస్ బలాన్ని పెంచుతూ..అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లోనే కాదు పక్క జిల్లాలో కూడా కాంగ్రెస్ విజయం లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార మరియు ప్రజాసంబంధాల మంత్రిగా పనిచేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్ తో ఎక్కువ సాన్నిహిత్యం ఉండటంవల్ల వైసీపీ గెలుపు కోసం అభ్యర్థులకు డబ్బులు పంపిస్తున్నారని మీ ఫై ఆరోపణలు వస్తున్నాయి..దీనిపై మీరేమంటారని జర్నలిస్టు అడుగగా.. వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్.. ఏ పార్టీకి తాను డబ్బులు ఇవ్వడం లేదని స్పష్టం చేసారు. అసలు తనవద్ద డబ్బుల్లేవని, తానే కష్టాల్లో ఉన్నానని ..ఏపీ నుంచి తనకు చాలా బిల్లులు రావాల్సి ఉందన్నారు. తాను కష్టాల్లో ఉంటే డబ్బులు ఎలా ఇస్తానని ప్రశ్నించారు. ఈయన మాటలు విన్న వారంతా ఆశ్చర్యపోతున్నారు..పార్టీలకు డబ్బులు ఇవ్వలేదంటే సరే కానీ తనవద్ద డబ్బులే లేవని చెప్పడం ఫై అంత షాక్ అవుతున్నారు. పొంగులేటి వద్ద డబ్బులు లేవంటే ఎవ్వరు నమ్మరని అంటున్నారు.

Read Also : AP Elections 2024: బీజేపీ అభ్యర్దిగా టీడీపీ నేత..చంద్రబాబు వ్యూహం