Ponguleti : కామన్ సెన్స్ లేదా..? అంటూ కలెక్టర్ పై మంత్రి పొంగులేటి ఆగ్రహం

Ponguleti : కామన్ సెన్స్ లేదా..? అంటూ కలెక్టర్ పై మంత్రి పొంగులేటి ఆగ్రహం

Published By: HashtagU Telugu Desk
Ponguleti Fire On Karimnaga

Ponguleti Fire On Karimnaga

కరీంనగర్ పర్యటన(Karimnagar Tour)లో కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొన్న సందర్భంలో.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Srinivas Reddy) పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పదే పదే తోసివేయడంపై అసహనం వ్యక్తం చేస్తూ, కలెక్టర్‌ (Karimnagar Collector Smt Pamela Satpathy)పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “వాట్ ఆర్‌ యూ డూయింగ్? వాట్ ఈజ్ దిస్ నాన్‌సెన్స్?” అంటూ కలెక్టర్‌ను ప్రశ్నించారు.

శుక్రవారం కేంద్రమంత్రి మనోహర్ లాల్ కట్టర్ కరీంనగర్ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయనతో పాటు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్‌లో 24 గంటల తాగునీరు, మల్టీ పర్పస్ పార్క్‌ల ప్రారంభోత్సవం జరిగింది. ఈ పర్యటనలో పోలీసుల తీరుపై మంత్రి పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్పీ ఎక్కడ అనే ప్రశ్నతో ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి పర్యటన సందర్భంగా ప్రజల్ని తోసివేయడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పర్యటనలో కరీంనగర్ బైపాస్ రోడ్‌లో ఉన్న డంప్ యార్డ్‌ను సందర్శించారు. అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలో బహిరంగ సభలో కేంద్రమంత్రి పాల్గొన్నారు.

  Last Updated: 24 Jan 2025, 06:07 PM IST