పాలేరు (Paleru) నియోజకవర్గం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో హాట్‌స్పాట్‌గా మారబోతోందని ఇప్పటికే రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తాజాగా KTR చేసిన వ్యాఖ్యలు ఈ వాదనలకు మరింత బలమిచ్చాయి. “ఈసారి పాలేరులో పొంగులేటి (Ponguleti Srinivas Reddy) ఎలా గెలుస్తారో చూస్తా” అని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. దీనికి ప్రతిస్పందనగా మంత్రి పొంగులేటి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆయన ఖమ్మం వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద మాట్లాడుతూ.. “మీ అయ్యా మూడుసార్లు పాలేరు వచ్చి ఏమీ చేయలేకపోయాడు.. నువ్వు బచ్చాగాడివి? నాపై పోటీ చేయడానికి ధైర్యం చేస్తావా?” అని బహిరంగంగా ప్రశ్నించారు.
OG Ticket : ‘OG’ మూవీ టికెట్ రేట్స్ పెరిగింది..వివాదం మొదలైంది
ఇదే సందర్భంలో పొంగులేటి తన విమర్శలను మరింత పదును పెట్టారు. “నువ్వు మూడున్నరేళ్ల తర్వాత అమెరికాలో ఉంటావా? ఇండియాలో ఉంటావా? అనేది ప్రజలే నిర్ణయిస్తారు” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం పాలేరు పరిధిలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చలకు దారి తీశాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య ఖమ్మం జిల్లాలో పోటీ కఠినంగా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పొంగులేటి ఈ వ్యాఖ్యలతో తన ధైర్యాన్ని చూపించడమే కాకుండా, ప్రత్యర్థి నేతల భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తడం గమనార్హం.
ఈ పరిణామాలు చూస్తే పాలేరు ఎన్నికల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కనుందనడం ఖాయం. కాంగ్రెస్ మంత్రిగా ఉన్న పొంగులేటి, తన ప్రభావాన్ని కాపాడుకునేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుండగా, బీఆర్‌ఎస్ తరఫున KTR చేసిన సవాళ్లు వర్గపోరాటాన్ని మరింత హాట్‌గా మార్చాయి. రాబోయే నెలల్లో అభివృద్ధి వాగ్దానాలు, పార్టీ ప్రతిష్ట, స్థానిక సమీకరణాలు – ఇవన్నీ పాలేరు ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో పొంగులేటి వ్యాఖ్యలు స్థానికుల మనసులను ఎంతవరకు ఆకర్షిస్తాయో, లేక KTR సవాలు బలంగా నిలుస్తుందో చూడాల్సి ఉంది.
కేటిఆర్ పైన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు ఫైర్..
‘‘పాలేరులో నా గెలుపును ఆపడానికి మీ నాయన మూడు సార్లు ముక్కు నేలకు రాసిన.. ఆయన వల్లే కాలేదు.. నీ వల్ల అవుద్దా.. బచ్చాగాడివి.. మూడున్నరేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల వరకు అసలు నువ్వు ఇండియాలో ఉంటావా.. సంచి సర్దుకుని అమెరికాకు… pic.twitter.com/UuvKo5a559
— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) September 18, 2025
