Site icon HashtagU Telugu

Telangana Congress: ఆట మొదలైంది !

Telangana Congress

Ata

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ బలంగా తయారైంది. భారీగా చేరికలు జరుగుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ గట్టి పోటీనిచ్చేందుకు రాజకీయంగా దూకుడు పెంచింది. గతంలో పార్టీని వీడిన నేతలను ఆహ్వానిస్తూ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు పార్టీ సీనియర్స్ కష్టపడుతున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ కు పిలుపొచ్చింది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనమయ్యారు.

ఢిల్లీ హైకమాండ్ పిలుపు మేరకు రేవంత్‌రెడ్డి సహా తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు హస్తిన చేరుకున్నారు. ఈ క్రమంలో ఈ రోజు సోమవారం మరికొందరు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్‌గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ భేటీ అవ్వనుంది. తెలంగాణాలో వాస్తవ పరిస్థితుల్ని రాహుల్ కు వివరించనున్నారు రేవంత్ బృందం. విశేషం ఏంటంటే రేవంత్ పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కూడా ఉన్నారు. భేటీలో భాగంగా రేవంత్ బృందం రాహుల్‌ గాంధీ , మల్లికార్జున ఖర్గేలతో రాజకీయ చర్చలు జరుపనున్నారు.

ఆట మొదలైంది!

ఇక ఆట మొదలైందని అన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇప్పటినుంచి తెలంగాణాలో రాజకీయ ఆట ఏంటో చూస్తారని ఆసక్తికర వ్యాఖ్యలతో హీట్ పుట్టించారు. తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నెరవేరబోతున్నట్టు చెప్పారు పొంగులేటి. భవిష్యత్తులో ఇతర పార్టీల నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లు తెలిపారు పొంగులేటి. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి రాజకీయ పునరేకీకరణ జరగబోతోందని అన్నారు. తాను ఎప్పుడూ పదవులు ఆశించలేదని, కెసిఆర్ ప్రభుత్వంలోకి రావడంలో తన పాత్ర కూడా ఉందని గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీకి వెళ్లిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పిడమర్తి రవి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి తదితరులు ఉన్నారు

Read More: Fight In Court : వీధి పోరాటాలు కాదు..ఇక న్యాయ పోరాటమే :రెజ్లర్లు

Exit mobile version