Telangana: రాష్ట్రంలో జరుగుతున్న పోలింగ్‌పై తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్ రాజ్(Chief Election Officer Vikas Raj) మీడియాతో మాటాడారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం బాగానే ఉందని ఆయన తెలిపారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం 50 దాటిందన్నారు. ఇక హైదరాబాద్‌లో మాత్రమ ఎప్పటిలాగానే ఈ సారి కూడా తక్కువగానే 20 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు. అంతేకాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతుందని వికాస్ రాజ్ వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా, తెలంగాణలో 3 గంటల వరకు 52.34 శాతం పోలింగ్ నమోదయింది. అత్యధికంగా ఖమ్మంలో 63.67 శాతం, కరీంనగర్‌లో 58.24 శాతం, మహబూబాబాద్‌లో 61.4 శాతం, పెద్దపల్లిలో 55.92 శాతం, నల్గొండలో 59.91 శాతం, హైదరాబాద్‌లో 29.47 శాతం పోలింగ్ నమోదయింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. 5 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి ఓటు వేసేందుకు అవకాశం ఇస్తారు. గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది.
Read Also: AP Polling : ఏపీలో 3గం ల వరకు 55 శాతం పోలింగ్
మరోవైపు రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకే తెలంగాణలో 40 శాతానికి పైగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. దీంతో 2019తో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం.