అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం బైనాక్యులర్‌ గుర్తును కేటాయించింది. ఈమేరకు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్‌లో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ విలీనానికి సంబంధించి చర్చలు జరిగినప్పటికీ.. కాంగ్రెస్‌ వైపు నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని వైఎస్‌ షర్మిల (Telangana Polls) ప్రకటించారు.