BJP Political Strike : తెలంగాణ BJP బ‌లోపేతానికి మాజీ సీఎం ఆప‌రేష‌న్

మాజీ సీఎంకు తెలంగాణ బీజేపీ టాస్క్ ను (BJP Political Strike)అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న ఆప‌రేష‌న్పై ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల న‌మ్మ‌కం.

  • Written By:
  • Publish Date - July 27, 2023 / 04:25 PM IST

ఒక మాజీ సీఎంకు తెలంగాణ బీజేపీ టాస్క్ ను (BJP Political Strike)అప్ప‌గించిన‌ట్టు తెలుస్తోంది. ర‌హస్యంగా ఆయ‌న చేస్తోన్న ఆప‌రేష‌న్ బీజేపీకి రాజ్యాధికారం తెచ్చిపెడుతుంద‌ని ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల న‌మ్మ‌కం. క‌నీసం 40 మందికి త‌గ్గ‌కుండా రాబోయే రెండు వారాల్లో సీనియ‌ర్లు ఇత‌ర పార్టీల నుంచి బీజేపీకి గూటికి చేర‌తార‌ని వినికిడి. ఆ మేర‌కు బీజేపీ వ‌ర్గాల్లోనూ చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ గ్రాఫ్ ప‌డిపోతుంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. దాన్ని అధిగ‌మించ‌డానికి మాజీ సీఎంను బీజేపీ ఎంచుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 మాజీ సీఎంకు తెలంగాణ బీజేపీ టాస్క్ ను (BJP Political Strike)

ప్ర‌స్తుతం మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి బీజేపీ లో ఉన్నారు. ఉమ్మ‌డి రాష్ట్ర సీఎంగా ప‌రువురితో ఆయ‌న స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ ప‌రిచ‌యాల‌ను ఉప‌యోగించ‌డం ద్వారా తెలంగాణ బీజేపీని బ‌ల‌ప‌రిచే ప్రయ‌త్నం ఆయ‌న చేస్తున్నారా? అంటే కాదంటున్నారు.(BJP Political Strike) బీజేజీలోని కీల‌క నేత‌లు. ఇక మిగిలిన మాజీ సీఎం చంద్ర‌బాబునాయుడు. ఆయ‌న ద్వారా బీజేపీని బ‌లోపేతం చేసుకోవ‌డానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్ర‌య‌త్నం చేస్తున్నారా? అంటే స‌మాధానం సూటికి చెప్ప‌డానికి త‌ట‌ప‌టాయిస్తున్నారు. మాజీ సీఎంలు కిర‌ణ్‌, చంద్ర‌బాబు కాకుండా ఇంకెవ‌రు ఉన్నారు? అంటూ మీడియా కూడా ఆరా తీస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో కింగ్ ఏపీలో కింగ్ మేక‌ర్

తెలంగాణ రాష్ట్రంలో కింగ్ ఏపీలో కింగ్ మేక‌ర్ కావాల‌ని అనేది బీజేపీ ల‌క్ష్యం. ఆ దిశ‌గా అడుగులు వేస్తూ ఒక్కసారిగా తెలంగాణాలో చ‌తికిల ప‌డింది. దానికి రెండు కార‌ణాల‌ను చెబుతున్నారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో క‌విత‌ను అరెస్ట్ చేయ‌క‌పోవ‌డాన్ని ఒక కార‌ణంకాగా, బండి సంజ‌య్ ను బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డం మ‌రో కార‌ణంగా భావిస్తున్నారు. ఏదైతేనేం, గ్రాఫ్ మాత్రం తెలంగాణ‌లో బీజేపీకి ప‌డిపోయింది. దాన్ని మ‌ళ్లీ పెంచుకోవ‌డానికి కిష‌న్ రెడ్డ‌కి బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. మాజీ సీఎంలు కిర‌ణ్ కుమార్ రెడ్డి, చంద్ర‌బాబుతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిష‌న్ రెడ్డికి పూర్వపు (BJP Political Strike) ప‌రిచ‌యాలు ఉన్నాయి. వాళ్ల‌తో లైజ‌నింగ్ చేసే లీడ‌ర్ గా గుర్తింపు ఉంది.

ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ బ‌ల‌హీనం

ఈనెల 29న అమిత్ షా తెలంగాణ వ‌స్తున్నారు. ఆ లోపుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి వ‌చ్చే లీడ‌ర్ల లిస్ట్ ను త‌యారు చేస్తున్నార‌ని వినికిడి. ఇప్ప‌టికే మాజీ సీఎం ఒక‌రు ఈ ఆప‌రేష‌న్ ను వేగంగా చేస్తున్నార‌ని స‌మాచారం. పూర్వ‌పు ప‌రిచ‌యాల‌తో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీ నుంచి భారీగా సీనియ‌ర్లు, పాపుల‌ర్ లీడ‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి ఆ మాజీ సీఎం ప‌లు ప్ర‌య‌త్నాల‌ను చేస్తున్నార‌ట‌. కొంత మేర‌కు ఇప్ప‌టికే ఫ‌లించ‌గా, రాబోవు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ కానుంద‌ని తెలుస్తోంది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే బీజేపీ మాస్ట‌ర్ ప్లాన్.(BJP Political Strike) వేసిన‌ట్టు భావించాలి. ఒక వేళ చంద్ర‌బాబుతో ఈ ఆప‌రేష‌న్ ను చేయిస్తుంటే మాత్రం బీజేపీ గ్రాఫ్ ఒక్క‌సారిగా పెరిగే అవ‌కాశం ఉంది.

Also Read : T BJP in Trouble : తెలంగాణ BJP ఢ‌మాల్! తోక‌ముడిచిన‌ట్టేనా?

ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ బ‌ల‌హీనంగా ఉంది. అందుకే, న‌ల్గొండ‌, ఖ‌మ్మం, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల నుంచి ఎక్కువ‌గా లీడ‌ర్ల‌ను బీజేపీలోకి తీసుకుంటున్నారు. రంగారెడ్డి, హైద‌రాబాద్ జిల్లాల్లో బీజేపీ బ‌లంగా ఉంద‌ని ఆ పార్టీ విశ్వ‌సిస్తోంది. ఇక ఉత్త‌ర తెలంగాణలో బీజేపీ ఆశించిన స్థానాల‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని అంచ‌నా వేస్తోంది. ఇప్ప‌టికే ఆర్ఎస్ఎస్ శ్రేణులు గ్రౌండ్లో పనిచేస్తున్నార‌ట‌. ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ స‌హ‌కారం తీసుకుంటే విజ‌యం సాధించిన‌ట్టేన‌ని ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు (BJP Political Strike) భావిస్తున్నార‌ని తెలుస్తోంది. ఈ ప‌రిణామాల‌ను అధ్య‌య‌నం చేస్తే అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీ ఒక అవ‌గాహ‌న‌తో వెళుతుందా? అనే అనుమానం క‌లుగ‌క మాన‌దు.

Also Read : Bandi Sanjay : అమిత్ షాని కలిసిన బండి సంజయ్.. అధ్యక్ష పదవి తొలగిన తర్వాత మొదటిసారి.. బండికి స్పెషల్ హామీలు?