కేసీఆర్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డ తీన్మార్ మల్లన్న ను కేసీఆర్ జైలుకు పంపారు. కేసీఆర్ ని జైలుకు పంపిస్తానని పలుమార్లు ప్రకటించిన బండి సంజయ్ ని కేసీఆర్ జైలుకు పంపారు. ఇక కేసీఆర్ కన్ను బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పై పడిందని, ఆయన్ని కూడా జైలుకు పంపిస్తారని తెలంగాణలో చర్చించుకుంటున్నారు.
మల్లన్న, బండి సంజయ్ తర్వాత కేసీఆర్ ని వ్యక్తిగతంగా, అవహేళన చేస్తూ తిట్టిన వారిలో ధర్మపురి అరవింద్ ఒకరు. అరవింద్ పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఆయన్ని అరెస్ట్ చేస్తే రాజకీయంగా పైచేయి సాధించడంతో పాటు తనపై వ్యక్తిగత దూషణ చేస్తే వదిలేది లేదని కేసీఆర్ ఒక ఇండికేషన్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు కన్పిస్తోంది. అయితే కేసులకి భయపడి, జైలుకు వెళాల్సి వస్తోందేమోననే అనుమానంతో అరవింద్ తప్పించుకొని తిరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా అరవింద్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోందని, పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడానికి ట్రేసింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తనపై అడ్డగోలుగా వ్యక్తిగత దూషణ చేరినవాళ్ళని ఇన్నిరోజులు వదిలిపెట్టానని, ఇకపై ఊరుకునేది లేదని ప్రకటించిన కేసీఆర్, తనని పర్సనల్ అంశాల్లో విమర్శించినవారిని ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తున్నట్లు కన్పిస్తోంది. ధర్మపురి అరవింద్ కనిపించగానే ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నా, మల్లన్న, బండి తర్వాత నెక్స్ట్ వికెట్ ఎవరిదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.