Political Parties Free Schemes : ఫ్రీ పథకాలు ఓటర్లకు నష్టమా.. లాభమా..?

గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని పార్టీలు ఫ్రీ..ఫ్రీ (Political Parties free Schemes) అంటూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడతాయి.

  • Written By:
  • Updated On - November 17, 2023 / 12:44 PM IST

ఎన్నికలు (Elections) వస్తున్నాయంటే చాలు గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని పార్టీలు ఫ్రీ..ఫ్రీ (Political Parties free Schemes) అంటూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడతాయి. మా పార్టీ ని గెలిపిస్తే మీకు అవి ఫ్రీ గా ఇస్తాం…ఇవి ఫ్రీగా ఇస్తాం అంటూ ప్రచారం చేసి ఓటర్లను (Voters) తమ వైపు తిప్పుకునేలా చేస్తారు. ప్రస్తుతం తెలంగాణ లో అదే జరుగుతుంది.

మరో 13 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Election 2023) జరగబోతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ (BRS) తో పాటు అన్ని పార్టీలు ఉచిత హామీలు (Political Parties free Schemes) ప్రకటిస్తూ ఎవరికీ వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. బిఆర్ఎస్ , కాంగ్రెస్ తో పాటు మరికొన్ని పార్టీలు తమను గెలిపిస్తే తక్కువ ధరకే గ్యాస్ ఇస్తాం.. రేషన్ కార్డు ఫై సన్నబియ్యం ఫ్రీ గా ఇస్తాం..మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం ఇలా తదితర హామీలను ప్రకటిస్తూ వస్తున్నారు. రేపు (నవంబర్ 18) బిజెపి పార్టీ సైతం తమ మేనిఫెస్టో ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ పార్టీ కూడా పలు ఉచిత హామీలు ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇలా అన్ని పార్టీలు ఉచిత హామీలతో (Political Parties free Schemes) అధికారంలోకి రావాలని చూస్తున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

మరి ఈ ఉచిత హామీలు (Free Schemes) ఓటర్లకు లాభమా..? నష్టమా..? అంటే ఖచ్చితంగా నష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ అమలు చేయాలంటే వేలకోట్లు కావాలి…అవన్నీ ఎక్కడి నుండి వస్తాయి..హామీలు ప్రకటించిన నేతల ఇళ్లనుండే అయితే ఇవ్వరు కదా..ఎవరైతే ఓటేసి గెలిపించారో వారి దగ్గరి నుండే వసూళ్లు చేసి..మళ్లీ వారికే ఇస్తారు..ఇప్పటికే అధికార పార్టీ హామీలు , పలు నిర్ణయాల వల్ల ధనిక రాష్ట్రం కాస్త అప్పుల రాష్ట్రంగా మారింది. రేషన్ ఫ్రీ , దళిత బంధు (Dalitha Bandhu) , రైతు బంధు (Rythu Bandhu) , హరితహారం ఇలా పలు అనవసర హామీలు , నిర్ణయాల వల్ల కోట్లాది కోట్లు నష్ట పోతున్నాం. ఆ భారం అంత కూడా ప్రతి ఒక్కరి ఫై పడుతుంది. ఏదోక పన్నుల రూపంలో తిరిగి ప్రజలు ప్రభుత్వానికే కట్టుకుంటూ వస్తున్నారు. ఎంతసేపు ఉచితంగా వస్తుందనే ఓటర్లు చూస్తున్నారు తప్ప..అవి తిరిగి మన దగ్గరి నుండే వసూళ్లు చేస్తున్నారనేది ఆలోచించడం లేదు.

ఒకప్పటి నిత్యావసర ధరలు , ఇప్పటి ధరలు ఎలా ఉన్నాయి..ఒక్కపుడు పెట్రోల్ , గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయి..ఇప్పుడు ఎలా ఉన్నాయి…వీటి ధరలన్నీ పెరగడానికి కారణం పార్టీలు ప్రకటిస్తున్న హామీల మూలానే. ఆ హామీలు అమలు చేయడం కోసం అనేక వాటిపై పన్నులు వసూళ్లు చేసి ఆ పన్నుల రూపంలో వచ్చిన డబ్బుతో హామీలు నెరవేరుస్తున్నారు. కానీ ఇక్కడ సగటు పేదవాడు నష్టపోతున్నాడు. అతడికి రోజు వచ్చే కూలి డబ్బుల్లో పావులా వంతు ఈ పన్నులకే కడుతుంటే..ఆ పేదవాడు ఎప్పుడు ధనికుడు అవ్వాలి..తన చిన్న చిన్న కోర్కెలు ఎప్పుడు తీర్చుకోవాలి.

హాస్పటల్ ఖర్చులు , చదువుల ఖర్చులు , ఇంట్లో నిత్యావసరాలు ఇలా వీటికే సంబదించిన డబ్బంతా పోతే..ఆ పేదవాడు ఎప్పుడు తన కలలను నెరవేర్చుకొని ధనికుడు అవుతాడు..సమాజంలో తనకంటూ ఓ గుర్తింపు ఎప్పుడు తెచ్చుకుంటాడు..? పేదవాడిని ఇంకా పేదవాడిని చేసేందుకే ఈ ఉచిత పథకాల్ని ..వీటిని ప్రకటించకపోతే..ఏ ఒక్కరిపై భారం పడదు..సంపాదించిన డబ్బులో కొంతైనా మిగులుతుంది..ఆ డబ్బుతో తన కోర్కెలు తీర్చుకోగలడు. అంతే కాదు రాజకీయపార్టీల తమ స్వలాభం కోసం సగటు మనిషిని సోమరి పోతుడ్లా చేస్తుంది. ఇప్పటికైనా ఉచిత హామీలు ప్రకటించి ప్రజలను మోసం చేయొద్దని సగటు పేదవాడి ఆవేదన.

Read Also : Only Ram : జనవరి 22 తర్వాత దేశమంతా రామనామ స్మరణే : ఆర్ఎస్ఎస్