Political Liquor : వ‌రంగ‌ల్ స‌భ‌లో ఢిల్లీ లిక్క‌ర్ కిక్

న‌రేంద్ర మోడీ ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ను (Political Liquor) క‌దిలించారు. అవినీతి చేయ‌డానికి రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిశాయ‌ని ఆరోపించారు.

  • Written By:
  • Updated On - July 8, 2023 / 04:43 PM IST

తెలంగాణ‌కు వ‌చ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ను (Political Liquor) క‌దిలించారు. వ‌రంగ‌ల్ వేదిక‌గా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో అవినీతి చేయ‌డానికి రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌లిశాయ‌ని ఆరోపించారు. ఢిల్లీ, తెలంగాణ ప్ర‌భుత్వాలు క‌లిసి లిక్క‌ర్ స్కామ్ కు తెర‌లేపాయ‌ని అన్నారు. ఇలాంటి ప్ర‌భుత్వాలు ఉండ‌కూడ‌ద‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. కుటుంబ పాల‌న సాగిస్తోన్న కేసీఆర్ ఆర్థికంగా బ‌ల‌ప‌డ్డార‌ని, రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేశార‌ని ఘాటుగా విమ‌ర్శించారు. తొమ్మిదేళ్ల క్రితం మిగులు బ‌డ్జెట్ తో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశార‌ని దుయ్య‌బ‌డుతూ అవినీతికి రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేతులు క‌ల‌ప‌డం ఇదే తొలిసారి అంటూ మోడీ ఫైర్ అయ్యారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ను (Political Liquor)

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ (Political Liquor) తెలంగాణ రాజ‌కీయాల‌ను మ‌లుపు తిప్పింది. ఆ కేసులో క‌విత‌ను అరెస్ట్ చేయ‌కుండా వ‌దిలేయ‌డం బీజేపీకి బ్లాక్ స్పాట్ గా మిగిలింది. అందుకే, ఆ పార్టీ గ్రాఫ్ ప‌డిపోయింద‌ని మాజీ ఎమ్మెల్యే రాజ‌గోపాల్ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. ఆ విష‌యాన్ని అధిష్టానం వ‌ద్ద విన్న‌వించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ఒక‌టేనంటూ కాంగ్రెస్ ప్ర‌చారం చేస్తోంది. దాన్ని న‌మ్మేలా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో అరెస్ట్ కాకుండా విడుద‌లైన క‌విత పేరును ప్ర‌స్తావిస్తోంది. వ‌రంగ‌ల్ వేదిక‌గా మోడీ ప్ర‌సంగంలోనూ ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ గురించి మాట్లాడుతూ కేజ్రీవాల్, కేసీఆర్ స‌ర్కార్ ల‌ను త‌ప్పుబ‌డుతూ రాజ‌కీయాన్ని వేడెక్కించారు.

కేసు చుట్టూ రాజ‌కీయ ప్ర‌చారాన్ని మోడీ మొద‌లు

తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత‌ను కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు సీబీఐ, ఈడీలు విచారించిన విష‌యం విదిత‌మే. మూడు రోజుల విచార‌ణ త‌రువాత క‌విత‌ను అరెస్ట్ చేయ‌కుండా ఈడీ విడుద‌ల చేసింది. ఆధారాలు లేవ‌ని తేల్చేసింది. అదే విష‌యాన్ని తాజా చార్జిషీట్ లోనూ పొందుపరిచింది. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం బ‌ద్నాం అయింది. అంతిమంగా తెలంగాణ బీజేపీ బ‌ల‌హీన‌ప‌డింది. ఇప్పుడు ఆ కేసు చుట్టూ రాజ‌కీయ ప్ర‌చారాన్ని మోడీ మొద‌లు పెట్టారు. దీని కార‌ణంగా మ‌రింత‌గా బీజేపీ గ్రాఫ్ (Political Liquor)  ప‌డిపోతుంద‌న్న ఆందోళ‌న ఆ పార్టీ శ్రేణుల్లో నెల‌కొంది.

మనీశ్‌ సిసోదియా సహా పలువురి ఆస్తులను ఈడీ అటాచ్‌

దిల్లీ మద్యం కేసులో  (Political Liquor) అరెస్టయిన ఆప్‌ కీలక నేత, దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా సహా పలువురి ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. సిసోదియాతో పాటు ఆయన సతీమణి, ఇతర నిందితులకు చెందిన రూ.52 కోట్లకు పైగా ఆస్తుల్ని అటాచ్‌ చేసినట్టు ప్రకటించింది. దిల్లీ మద్యం విధానానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో ఈ ఆస్తులను అటాచ్‌ చేసినట్టు ఈడీ వెల్లడించింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద సిసోదియా, ఆయన సతీమణి సీమా సిసోదియాకు చెందిన రెండు స్థిరాస్తులతో పాటు మరో ఇద్దరు నిందితులైన రాజేశ్ జోషీ (ఛారియట్‌ ప్రొడెక్షన్స్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌)కు చెందిన భూమి/ఫ్లాట్‌; అలాగే, గౌతమ్‌ మల్హోత్రాకు చెందిన భూమి/ ఫ్లాట్‌ మొత్తంగా రూ.7.29కోట్ల స్థిరాస్తుల్ని అటాచ్‌ చేసినట్టు ప్రొవిజినల్‌ ఆర్డర్‌లో పేర్కొంది.

Also Read : Delhi Liquor Policy Case: మద్యం కేసులో సిసోడియాకు మరో ఎదురుదెబ్బ

మనీశ్ సిసోదియా బ్యాంకు బ్యాలెన్సు రూ.11.49లక్షలు, బ్రిండ్కో సేల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (రూ.16.45కోట్లు) ఆస్తులతో పాటు ఈ కేసులో ఇతరులకు సంబంధించి రూ.44.29 కోట్ల విలువైన చరాస్తులను అటాచ్‌ చేసినట్టు ఈడీ తెలిపింది. అటాచ్‌ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.52.24కోట్లుగా ఉన్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. మద్యం కుంభకోణం కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియాను మార్చిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

Also Read : Delhi Liquor : క‌విత మ‌రో క‌నిమొళి కాదు..డాట‌ర్ ఆఫ్ ఫైట‌ర్‌!

ఇదే కేసులో క‌విత ఉంద‌ని వీడియోల‌ను బీజేపీ బ‌య‌ట‌పెట్టింది. వాటిని ఈడీకి కూడా అంద‌చేసింది. అయిన‌ప్ప‌టికీ అరెస్ట్ నుంచి తృటిలో త‌ప్ప‌డం వెనుక రాజ‌కీయ గేమ్ ఉంద‌ని కాంగ్రెస్ ప్ర‌చారం చేస్తోంది. దాన్ని ప్ర‌జ‌లు కూడా బ‌లంగా విశ్వసిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో న‌రేంద్ర మోడీ ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ ను ప్ర‌స్తావించ‌డం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా క‌విత అరెస్ట్ వ్య‌వ‌హారం మారింది.