Political king pin : BRS, కాంగ్రెస్ జాత‌కాల‌ను మార్చ‌నున్న MIM

లంగాణ ఎన్నిక‌ల్లో ఎంఐఎం(Political king pin) ప్ర‌ధాన పార్టీల భ‌విష్య‌త్ ను మార్చ‌బోతుంది. సీఎం కేసీఆర్ త‌ల‌రాత‌ల‌ను తిర‌గ‌రాయ‌బోతుంది.

  • Written By:
  • Updated On - June 2, 2023 / 03:21 PM IST

తెలంగాణ ఎన్నిక‌ల్లో ఎంఐఎం(Political king pin) ప్ర‌ధాన పార్టీల భ‌విష్య‌త్ ను మార్చ‌బోతుంది. సీఎం కేసీఆర్ త‌ల‌రాత‌ల‌ను తిర‌గ‌రాయ‌బోతుంది. ప్ర‌స్తుతం అస‌రుద్దీన్ చేస్తోన్న కామెంట్స్ ఆధారంగా బీఆర్ఎస్ కు ఈసారి ఎంఐఎం జ‌ల‌క్ ఇచ్చేలా క‌నిపిస్తోంది. ఒక వేళ హైద‌రాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని చోట్ల పోటీ చేస్తే ఆ పార్టీ ప్ర‌భావం బీఆర్ఎస్(BRS) మీద తీవ్రంగా ఉండ‌నుంది. అలాగే, కాంగ్రెస్ పార్టీ మీద కూడా ప‌డ‌నుంది. ఫ‌లితంగా బీజేపీ వేసి స్కెచ్ పార‌నుందని రాజ‌కీయ విశ్లేష‌కుల తాజా అంచ‌నా.

తెలంగాణ ఎన్నిక‌ల్లో ఎంఐఎం ప్ర‌ధాన పార్టీల భ‌విష్య‌త్(Political king pin) 

కొత్త స‌చివాల‌యం స్నేహితుల మ‌ధ్య గ్యాప్ ను(Political king pin) రేపింది. అక్క‌డ ఉన్న మ‌సీదును కూల్చివేశార‌ని అస‌రుద్దీన్ చేస్తోన్న ఆరోప‌ణ‌. స‌చివాల‌యం పూర్త‌యిన త‌రువాత మ‌సీదును ఎందుకు నిర్మించ‌లేద‌ని నిల‌దీస్తున్నారు. ఆ విష‌యాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా అడ‌గ‌డంలేద‌ని ఆయ‌న నిల‌దీస్తున్నారు. అంతేకాదు, అధికారంలోకి వ‌స్తే ప్ర‌తి గ్రామానికి రామాల‌యాన్ని నిర్మిస్తామ‌ని రేవంత్ రెడ్డి చెప్ప‌డాన్ని గుర్తు చేస్తున్నారు. కొత్త స‌చివాల‌యం గుజ‌రాత్ లోని ఒక హ‌నుమాన్ దేవాల‌యం త‌ర‌హాలో ఉంద‌ని ఆరోపిస్తున్నారు. అంటే, ఒకేసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల‌ను అసరుద్దీన్ టార్గెట్ చేస్తున్నారు. రాబోవు ఎన్నిక‌ల వ‌ర‌కు ఇదే పంథాలో వెళితే ఆ రెండు పార్టీల మీద ముస్లిం ఓట‌ర్ల(Muslim Voters) ప్ర‌భావం ప‌డ‌నుంది.

 తెలంగాణ రాష్ట్రంలో హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ ఒక ప్ర‌త్యేక ప్రాంతంగా

తెలంగాణ రాష్ట్రంలో హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ ఒక ప్ర‌త్యేక ప్రాంతంగా ప‌రిగ‌ణిస్తున్నారు. అక్క‌డ‌కు వెళ్ల‌డానికి ఊబ‌ర్, ఓలా కంపెనీలు కూడా ధైర్యం చేయ‌లేవు. విద్యుత్ బిల్లులు సుమారు 7వేల కోట్ల వ‌ర‌క బ‌కాయిలు ఆ ప్రాంతంలో ఉన్నాయ‌ని చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ ఏ ప్ర‌భుత్వం అడిగే ధైర్యం లేదు. కేవ‌లం 7 మంది ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఎంఐఎం కు ఉన్న‌ప్ప‌టికీ అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్, విప‌క్షం బీజేపీ కంటే ప్రాధాన్యం ఇస్తుంటారు సీఎం కేసీఆర్. అందుకు కార‌ణం లేక‌పోలేదు. స‌హ‌జ మిత్ర‌త్వం ఉన్న పార్టీగా ఎంఐఎంను ప‌రిగ‌ణిస్తారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లోనూ ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణి ఆ రెండు పార్టీల మ‌ధ్య ఉంది. అదే స్నేహాన్ని కొన‌సాగిస్తూ పోతే, రాబోవు రోజుల్లో ఎంఐఎం మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌ని అసరుద్దీన్ భావించిన‌ట్టు తెలుస్తోంది. అందుకే, ఈసారి ఎన్నిక‌ల్లో హైద‌రాబాద్ వ‌ర‌కు మాత్ర‌మే కాకుండా తెలంగాణ‌లోని క‌నీసం 45 చోట్ల బ‌రిలోకి దిగ‌డానికి సిద్ద‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం. దీంతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మ‌దిలో(Political king pin) ఆందోళ‌న మొద‌లైయింద‌ని పార్టీ వ‌ర్గాల్లోని వినికిడి.

Also read : MIM Voice change : కారుకు ఓవైసీ ప్ర‌మాదం! కాంగ్రెస్ తో పొత్తు దిశ‌గా గ‌ళం.!!

ప‌లు రాష్ట్రాల్లో పోటీ చేస్తోన్న ఎంఐఎం తెలంగాణ‌లోని ప‌ది స్థానాల‌కు ప‌రిమితం అవుతుంది. ఈసారి 45 స్థానాల మీద దృష్టి పెట్టింది. బీహార్ రాష్ట్రంలో ఎంఐఎం (MIM)ప్రాతినిధ్యం అసెంబ్లీలో ఉంది. యూపీ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేసింది. కానీ, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో సైలెంట్ అయింది. ఫ‌లితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగ‌లిగింది. సాధార‌ణంగా దేశ వ్యాప్తంగా ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు ఎక్కువ‌గా ఉంటుంది. ఆ ఓటు బ్యాంకును ఎంఐఎం ప్ర‌తి రాష్ట్రంలోనూ చీల్చుకుంటోంది. ఫ‌లితంగా బీజేపీ లాభ‌ప‌డుతూ వ‌చ్చింది. కానీ, క‌ర్ణాట‌క‌లో మాత్రం వ్యూహాత్మంగా ఎంఐఎం సైలెంట్ కావ‌డంతో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వ‌చ్చింది. ఇదే పంథాను తెలంగాణ‌లోనూ కొన‌సాగిస్తే ముస్లిం ఓటు బ్యాంకు (Political king pin)బీఆర్ఎస్ వైపు వెళ్ల‌నుంది.

హిందూ ఓటు బ్యాంకు ఎక్కువ‌గా బీజేపీ వైపు

తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంకును బీఆర్ఎస్ వైపు మ‌ళ్లించ‌డానికి కార‌ణం ఎంఐఎం (Political king pin)పోక‌డ‌. స‌హ‌జ మిత్రునిగా కేసీఆర్ ను ఫోకస్ చేసింది. ఫ‌లితంగా కాంగ్రెస్ పార్టీని కాద‌ని బీఆర్ఎస్ వైపు ఓటు బ్యాంకు వెళ్లింది. దీంతో రెండుసార్లు వ‌రుస‌గా కేసీఆర్ సీఎం అయ్యారు. ఈసారి ఎంఐఎం రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది. అదే జ‌రిగితే, కాంగ్రెస్-బీఆర్ఎస్ కు వెళ్ల‌కుండా ముస్లిం ఓటు బ్యాంకు ఎంఐఎంకు వ‌చ్చే ఛాన్స్ ఉంది. హిందూ ఓటు బ్యాంకు ఎక్కువ‌గా బీజేపీ వైపు ఉంటుంది. అంతిమంగా కాంగ్రెస్, బీఆర్ఎస్(BRS) వెనుక‌బడిపోయే అవ‌కాశం ఉందని స‌ర్వేల సారంశం. అందుకే, అస‌రుద్దీన్ ఈసారి తెలంగాణ ఎన్నిక‌ల్లో కేసీఆర్, కాంగ్రెస్ జాత‌కాల‌ను మార్చ‌బోతున్నార‌ని బ‌లంగా వినిపిస్తోంది.

Also Read : Sharmila strategy : BRS, కాంగ్రెస్ పొత్తుపై ష‌ర్మిల‌, KCR కు ద‌శ‌ ప్ర‌శ్న‌లు!