Harish Rao : హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రకు తెరతీసిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అన్ని అనుమతులున్నా.. అక్రమం కాకున్నా.. అక్రమం అంటూ టార్గెట్ చేసి కూల్చివేతలకు పాల్పడుతుండటం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రాజకీయ కక్షకు విద్యాసంస్థలు టార్గెట్ కాకూడదని హరీష్ రావు సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనే హైడ్రా టార్గెట్ చేయడం మంచి పరిణామం కాదన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) మాట్లాడారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో నిక్కచ్చిగా పనిచేసిన వ్యక్తి. చీమకు హాని చెయ్యని వ్యక్తి ఆయన. పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీలో చెరువు భూమి ఉంటే దగ్గర ఉండి కూలగొట్టండి. రాజకీయంగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఎదుర్కోలేక ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కాలేజీ ఎఫ్‌టీఎల్‌లో లేదని ఇరిగేషన్ అధికారులు చెప్పారు. విద్యార్థులు చదువుకుంటున్న సమయంలో ఇప్పుడు కూలుస్తాం అంటే ఎలా ?అనురాగ్ యూనివర్సిటీ ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్ లో లేదు. బఫర్ జోన్‌లో ఉంటే నేనే దగ్గర ఉండి కూలగొడతాను. ఎక్కడైనా తప్పు జరిగితే చెప్పండి.. నోటీసులు ఇవ్వండి. అంతేకానీ రాత్రికి రాత్రి కూలగొడుతాము అంటే ఎలా ? అనురాగ్ మెడికల్ కాలేజీలో అనేక పరికరాలు ఉన్నాయి’’ అని హరీశ్ రావు తెలిపారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కేసుల పేరుతో ఒత్తిడి పెంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నారని ఆరోపించారు.
Also Read :Gokul Chat Blasts : గోకుల్‌ఛాట్ బాంబు పేలుళ్లకు 17 ఏళ్లు.. ఆనాడు ఏం జరిగిందంటే..
‘‘తెలంగాణలో విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. డెంగ్యూతో రోజుకొకరు చనిపోతున్నారు. అయినా హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు లేవు. గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. చెత్త ఎత్తే పరిస్థితీ లేదు’’ అని హరీశ్ రావు ఆరోపించారు.