Site icon HashtagU Telugu

Political Campaign : ప్రచార ఖర్చుతో నేతలు పరేషాన్‌.. రోజుకు 20 లక్షలు అంట..!

Political Campaign

Political Campaign

దేశ వ్యాప్తంగా లోక్‌ సభ ఎన్నికల కోసం ఆయా పార్టీల నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈసారి లోక్‌ సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగునున్న విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికల షెడ్యూల్‌ దాదాపు రెండు నెలల పాటు ఉండటంతో ప్రచార ఖర్చును చూసి అభ్యర్థుల బెంబేలెత్తుతున్నారు. అయితే.. ఈ రెండు నెలల సమయం కొందరికి కలిసి వస్తే.. మరికొందరికి కత్తుమీద సాముల తయారైంది. ప్రజల్లోకి వెళ్లి.. వాళ్లతో మమేకమవడానికి కొందరు ఈ సమాయాన్ని వినియోగించుకుంటుంటే.. మరి కొందరికి ప్రచార భారం పైన పడుతుండటం గమనార్హం. అయితే.. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పోటాపోటీ వ్యూహాలు పన్నడంతో భీకర రాజకీయ రణరంగాన్ని చూశాం. అయితే, లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నాకొద్దీ.. గెలుపే లక్ష్యంగా.. ప్రధాన పార్టీలు ప్లాన్‌లు వేస్తున్నాయి. అదే ఉత్సాహం పార్టీల్లో అంతటా ఉప్పొంగినట్లు కనిపిస్తోంది. కానీ.. అభ్యర్థులకు మాత్రం ఖర్చు తడిసి ముద్దవుతుండటంతో గందరగోళానికి లోనవుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

పోలింగ్‌కు ఇంకా 40 రోజుల గడువు ఉన్నప్పటికీ, ప్రధాన పార్టీలు తమ ప్రచార ప్రయత్నాల్లో అదే స్థాయిలో ఉత్సాహం చూపడం లేదు. బదులుగా, వ్యక్తిగత అభ్యర్థులు మాత్రమే వారి అనుచరులతో అక్కడక్కడా ప్రచారం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి ప్రచారం ఇంకా ప్రారంభం కాలేదు. సాధారణ ఎన్నికల సందడి కనిపించడం లేదు. తమ వనరులను హరించగల భారీ ప్రచారాలను ప్రారంభించడానికి పార్టీలు వెనుకాడడంతో ఖర్చు ఆందోళనలు అతిపెద్ద అంశంగా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో కార్యకర్తలతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలంటే రోజుకు రూ.20 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని నేతలు అంచనా వేస్తున్నారు. 25 రోజుల పోలింగ్ సమయం సరిపోతుందని భావించిన ప్రధాన పార్టీల అగ్రనేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసి 18న నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు వేచి చూడాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే.. రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉండటంతో.. కొంత ప్రచారానికి కూడా ఇబ్బంది నెలకొంది. ఎండ తీవ్రతను చూసి ప్రచారంలో పాల్గొనేందుకు జనాలు రాకపోవడంతో ఉదయం, సాయంత్రం అలా షెడ్యూల్‌ ప్రచారం చేస్తున్నారు. నియోకవర్గాల్లో పూర్తిగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు కొంత సమయం తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో సమావేశాలు నిర్వహించి ప్రచారంలో ఎంచుకోవాల్సి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.
Read Also : Summer: వడదెబ్బతో బాధపడుతున్నారా.. ఈ జాగ్రత్తలు మస్ట్, అవి ఏమిటంటే