దీపావళి (Diwali ) పండుగ సందర్భంగా ప్రజల ఆరోగ్యం, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పోలీసులు (HYD Police) ఆంక్షలు విధించారు. ముఖ్యంగా శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు 55 డెసిబెల్స్ లోపు శబ్దం చేసే టపాసులను మాత్రమే అనుమతించారు.
ఈ నిబంధనల ప్రకారం:
కేవలం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చడానికి అనుమతి ఉంటుంది. 55 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్దం చేసే టపాసులు పూర్తిగా నిషేధం. ఈ నిబంధనలను అతిక్రమిస్తే, నిబంధనలను అతిక్రమించిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా తీసుకున్న ఈ చర్యలు పర్యావరణ పరిరక్షణ, ప్రజల శ్రేయస్సు కోసం తీసుకున్నవని అధికారులు తెలిపారు.
దీపావళి, దీపోత్సవం లేదా దీపావళి పండుగ హిందూ ధర్మంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పండుగలలో ఒకటి. దీపావళి అంటే “దీపాల వరుస” ఇది వెలుగుల పండుగగా కూడా ప్రసిద్ధి. ఇది అంధకారాన్ని తొలగించి వెలుగులు మరియు శుభశాంతి నింపే సంకేతంగా భావిస్తారు. ఈ పండగను జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది.
చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాలికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. దీన్ని నరక చతుర్దశి జరుపుకుంటారు.
సాధారణంగా దీపావళి కార్తీక అమావాస్య రోజున సాయంకాలం సూర్యాస్తమయం తరువాత లక్ష్మీ పూజ చేస్తారు. కానీ ఈసారి అమావాస్య తిథి అక్టోబర్ 31 మధ్యాహ్నం 3:12 గంటలకు ప్రారంభమై, నవంబర్ 1 సాయంత్రం 5:53 గంటల వరకు ఉంటుంది. నవంబర్ 1న సాయంత్రం 6 గంటలకు అమావాస్య ముగియడం వల్ల, పూజ సమయం గురించి అందరు అయోమయం అవుతున్నారు. ఆచార సాంప్రదాయాల ప్రకారం, అక్టోబర్ 31 సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత లక్ష్మీ పూజ చేసుకోవడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు.
అలాగే పూజా (Diwali Laxmi Puja 2024) సమయాలు చూస్తే..
లక్ష్మీ పూజ ముహూర్తం: అక్టోబర్ 31, 2024న సాయంత్రం 05:36 నుండి 06:16 వరకు
అమావాస్య తిథి ప్రారంభం: అక్టోబర్ 31, 2024న మధ్యాహ్నం 03:52
అమావాస్య తిథి ముగింపు: నవంబర్ 01, 2024న సాయంత్రం 06:16 గంటలకు.
Read Also : Rave Party : జన్వాడ రేవ్ పార్టీ లో కేటీఆర్ సతీమణి శైలిమా..?