Telangana: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత తెలంగాణలో భారీగా నగదు పట్టుబడుతోంది. ఎక్కడికక్కడ పోలీసులు చెక్ పోస్టులు పెట్టి అవినీతి డబ్బుని స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా లెక్కల్లో చూపని 3.4కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా వాడపల్లిలోని అంతర్‌రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు వద్ద కారు నుంచి రూ.3.04 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు మాడ్గులపల్లి వద్ద పోలీసులు ఆపేందుకు ప్రయత్నించగా కారు ఆపకుండా వేగంగా వెళ్లిపోయింది. కారులో డబ్బును తరలిస్తున్న గుజరాత్‌కు చెందిన విపుల్ కుమార్ (46), అమర్ సిన్హా జాల (52)లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అపూర్వరావు మాట్లాడుతూ అక్రమంగా డబ్బు, మద్యం రవాణాను అరికట్టేందుకు చేపట్టిన వాహనాల తనిఖీల్లో భాగంగా మాడ్గులపల్లి పోలీసులు మాడ్గులపల్లి టోల్ ప్లాజా వద్ద కారును ఆపేందుకు ప్రయత్నించారని తెలిపారు. కారులోని వ్యక్తులు పోలీసుల ఆదేశాలను పాటించకుండా వేగంగా వెళ్లిపోయారు. మాడ్గులపల్లి పోలీసులు అప్రమత్తమై మిర్యాలగూడ పోలీసులు కూడా పట్టణంలోని ఏడ్గులగూడ చెక్‌పోస్టు వద్ద కారును ఆపేందుకు ప్రయత్నించగా అక్కడ కూడా కారు ఆగలేదు. అనంతరం వాడపల్లి సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి కారును అడ్డుకున్నారు. వారి వద్ద రూ.రూ.3.04 కోట్లు స్వాధీనం చేసుకుని ప్రయాణికులను అదుపులోకి తీసుకున్నారు అని చెప్పారు.
తెలంగాణలో పోలీసులు ఇప్పటి వరకు రూ. 7.39 కోట్ల నగదు, మద్యం విలువ రూ.1.71 కోటి పట్టుకున్నారు. మునుముందు భారీగా పట్టుబడే అవకాశం ఉంది.
Also Read: Akira Nandan Cine Entry : అకీరా ఇంట్రీపై రేణు క్లారిటీ