తెలంగాణ లో ఎన్నికల నగారా (Telangana Election Schedule 2023) మోగడం తో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడే పోలీసులు (Police) తనిఖీలు చేపడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. నవంబర్ 30 న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 03 న ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఈ క్రమంలో నిన్నటి నుండే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమలై 24 గంటలు గడవకముందే రాష్ట్రవ్యాప్తంగా భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారిగా చెక్ పోస్టులు, అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకొని పోలీసులు నిఘా పెంచారు. ఎక్కడ వాహన తనిఖీ నిర్వహించిన పోలీసులకు నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఖమ్మం జిల్లా ఆత్మకూరు చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులకు సుమారు రూ.12 లక్షలు లెక్కలోలేని డబ్బు పట్టుబడ్డాయి. కొణిజర్ల చెక్ పోస్టు వద్ద రూ.2 లక్షలు పట్టుబడగా, హైదరాబాద్ లోని వనస్థలిపురం వద్ద రూ.4 లక్షలు దొరికాయి..నేడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో రూ. 3 కోట్ల 35 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. అయితే డబ్బులకు సంబంధించిన లెక్కలు చూపించకపోవడంతో వాటిని పోలీసులు సీజ్ చేశారు.
ఇక నిన్న శేరిలింగంపల్లి పరిధిలోని గోపనపల్లిలో కాంగ్రెస్ నేత ఫొటోతో ఉన్న రైస్ కుక్కర్లను పంపిణీ చేస్తున్న కొందరిని గచ్చిబౌలి పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి.. 87 కుక్కర్లు స్వాధీనం చేసుకున్నారు. వనస్థలిపురంలో నాలుగు లక్షల రూపాయలను సీజ్ చేశారు. బషీర్ బాగ్ తనిఖీల్లో భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారంతోపాటు 300 కేజీల వెండి సీజ్ చేశారు. ఫిల్మ్ నగర్‌లో రూ.30 లక్షల నగదు పట్టుకున్నారు పోలీసులు. ఓవరాల్ గా రెండు రోజుల్లోనే కోట్లాది రూపాయిలు పోలీసులకు పట్టుబడగా..రాబోయే రోజుల్లో ఇంకెన్ని కోట్లు పట్టుబడతాయో చూడాలి.
Read Also : Nara Lokesh : ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ.. రేపు మరోసారి విచారణకు రావాలన్న సీఐడీ