Ganja : సిమెంట్ ఇటుక‌ల కింద గంజాయి ర‌వాణా.. మంచిర్యాల‌లో బ‌య‌ట‌ప‌డ్డ స్మ‌గ్లింగ్‌

తెలంగాణ‌లోని మంచిర్యాల‌లో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రూ.93 లక్షల

  • Written By:
  • Publish Date - September 27, 2023 / 10:28 PM IST

తెలంగాణ‌లోని మంచిర్యాల‌లో భారీగా గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రూ.93 లక్షల విలువైన గంజాయి, ట్రాక్టర్, రెండు మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీరాంపూర్ పోలీస్ ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ డ్యూటీలో ఉండగా మందమర్రి ఎక్స్ రోడ్డులో జీఎం ఆఫీస్ సమీపంలో అనుమాన‌స్ప‌దంగా ట్రాక్ట‌ర్ క‌నిపించింద‌ని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి తెలిపారు. ఆ ట్రాక్ట‌ర్‌ని ప‌రిశీలించ‌గా.. సిమెంట్ ఇటుకలతో కూడిన నంబర్ ప్లేట్ లేని ట్రాక్టర్ రోడ్డుపై ఉంచిన‌ట్లు పోలీసులు గుర్తించార‌ని తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ అక్క‌డ లేక‌పోవ‌డంతో.. ట్రాఫిక్ రద్దీని క్లియర్ చేయడానికి పోలీస్ స్టేషన్‌కు తరలించారని ఎస్పీ తెలిపారు. ట్రాక్టర్‌ను క్లెయిమ్ చేస్తూ ఎవరూ పీఎస్‌కు రాకపోవడంతో అనుమానం వ‌చ్చిన పోలీసులు ట్రాక్టర్‌ని తనిఖీ చేయగా సిమెంట్ ఇటుకల కింద దాచి ఉంచిన 93 గంజాయి ప్యాకెట్లు కనిపించాయని తెలిపారు. ఈ గంజాయి సుమారు 465 కిలోలు ఉంటుంద‌ని.. దీని విలువ దాదాపు రూ.93 ల‌క్ష‌లు ఉంటుంద‌ని తెలిపారు.

ట్రాక్టర్‌ను త‌నిఖీ చేయ‌గా.. దానిలో ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి, బలిమెల నివాసి చిత్రసేన్ క్రిసాని యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ బ‌య‌ట‌ప‌డింది. వెంటనే టాస్క్‌ఫోర్స్‌ రామగుండం, శ్రీరాంపూర్‌ సర్కిల్‌ అధికారులతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల ఆచూకీ కోసం ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా బలిమెలకు పంపారు. ఈ ఆపరేషన్‌లో త‌మ ప్రత్యేక బృందం స్థానిక పోలీసుల సహాయంతో చిత్రసేన్ క్రిసాని (ట్రాక్టర్ యజమాని), జగబంధు (చిత్రసేన్ సోదరుడు) అనే ఇద్దరు అనుమానితులను పిలిపించి దర్యాప్తు అధికారి ముందు హాజరుపరిచారు.