Telangana Elections : గాంధీభ‌వ‌న్‌లో “కేసీఆర్ 420” కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు

పదేండ్ల కేసీఆర్ పాల‌న‌లో అప్పులు పాలు చేశారంటూ నాంప‌ల్లి గాంధీభ‌వ‌న్‌లో ఓ కారును ప్ర‌ద‌ర్శించారు. ఆ కారుపై కేసీఆర్ 420

Published By: HashtagU Telugu Desk
car

car

పదేండ్ల కేసీఆర్ పాల‌న‌లో అప్పులు పాలు చేశారంటూ నాంప‌ల్లి గాంధీభ‌వ‌న్‌లో ఓ కారును ప్ర‌ద‌ర్శించారు. ఆ కారుపై కేసీఆర్ 420 అని రాసి ఉంది. అయితే ఈ కారును నాంపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో ఉంచిన కారును పోలీసులు తీసుకెళ్ల‌డాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. నాంపల్లిలోని కాంగ్రెస్ కార్యాలయం నుండి మా ‘కెసిఆర్ 420’ ప్రచార కారును పోలీసులు జప్తు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. పోలీసులు అధికారాన్ని అప్రజాస్వామికంగా ఉపయోగించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంద‌ని ట్వీట్ లో పేర్కొంది. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)ని, ఆ పార్టీ నాయకత్వాన్ని అవహేళన చేస్తూ మోడల్ కారును ఏర్పాటు చేశారు. BRSతో సంబంధం ఉన్న ఆరోపించిన స్కామ్‌లకు ప్రతీకగా వారు పింక్ కారును ప్రదర్శించారు. మద్యం అమ్మకాల ద్వారా బీఆర్‌ఎస్ డబ్బు సంపాదిస్తున్నదని ఆరోపిస్తూ కేసీఆర్ పాలనను 90 ఎంఎల్ ప్రభుత్వంగా ముద్ర వేసింది.

Also Read:  Telangana : కేసీఆర్ ఫై ప్రశంసలు కురిపించిన ఎంపీ అర్వింద్‌

  Last Updated: 05 Nov 2023, 09:37 PM IST