జన్వాడ ఫాంహౌస్ కేసు (Janwada Farmhouse Case)లో నిందితుడిగా ఉన్న విజయ్ మద్దూరి (Vijay Madduri) ఇంట్లో మోకిల పోలీసులు సోదాలు నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్‌లో రెండు రోజుల క్రితం పోలీసులు సోదాలు నిర్వహించి, కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 41లోని విజయ్ మద్దూరి నివాసంలో మంగళవారం సాయంత్రం మోకిల పోలీసులు సోదాలు నిర్వహించారు.
జన్వాడ ఫాంహౌస్‌లో విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు పరీక్షల్లో తేలింది. విజయ్‌కి కొకైన్ ఎలా వచ్చిందనే అంశంపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. రాజ్ పాకాల తనకు కొకైన్ ఇచ్చాడని విజయ్ మద్దూరి చెప్పినట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే విజయ్ మాత్రం దీనిని ఖండించారు. విజయ్ మద్దూరి సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్, CEO గా పనిచేస్తున్న వ్యక్తిగా ప్రసిద్ధి గాంచారు. టెక్నాలజీ రంగంలో ఆయనకు మంచి అనుభవం ఉంది, అలాగే ప్రముఖ సంస్థల్లో పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు. ఇటీవల జన్వాడ ఫాంహౌస్ కేసులో ఆయన పేరు బయటికి రావడంతో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. రాజ్‌పాకాల ఫాంహౌస్ రేవ్ పార్టీ కేసులో తనపై ఆరోణలు అన్నీ నిరాధారామన్నారు విజయ్ మద్దూరి. ఎఫ్ఐఆర్ పేరుతో చేస్తున్న ప్రచారం తప్పన్నారు.
ఇండియాలో తాను ఎలాంటి ఇల్లీగల్ పదార్థాలు సేవించలేదన్నారు. తన మిత్రుడు రాజ్ పాకాల ఫ్యామిలీ ఫంక్షన్‌కి,దివాలీ పార్టీ కోసం ఆహ్వానించారని..కుటుంబంతో కలిసి హాజరయ్యానని ఆయన చెప్పారు. పోలీసులు చేస్తున్న ఆరోపణలతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నామంటూ వీడియోలో తెలిపారు. 25ఏళ్ల మచ్చలేని కెరియర్‌ను ఒక్క ఆరోపణతో మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారన్నారు విజయ్ మద్దూరి.
Read Also : Koushik Reddy : కౌశిక్ రెడ్డి ఆంబోతులా తయారయ్యాడు – ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్