Pragathi Bhavan : ప్రగతి భవన్ ముందున్న బారిగేట్లును తొలగిస్తున్న పోలీసులు

ప్రగతి భవన్ ముందు ఉన్న బారిగేట్లును తీసేయాలని ఆదేశించారు

  • Written By:
  • Publish Date - December 7, 2023 / 11:33 AM IST

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌ (Pragathi Bhavan)కు ‘ప్రజా పాలన భవన్’ అని పేరు పెడతామని..ప్రజల సమస్యలు తీర్చే ప్రజా దర్భార్ గా మారుస్తామని..ఈ భవన్ తలుపులు 24 గంటలు ప్రజల కోసం తెరిచే ఉంటాయని చెప్పిన కాంగ్రెస్ (Congress)..చెప్పినట్లు ఆ పనిచేస్తుంది. ప్రగతి భవన్ ముందు ఉన్న బారిగేట్లును తీసేయాలని ఆదేశించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు బారిగేట్లును తొలగించే పనిలో పడ్డారు. పదేళ్లు గా ప్రగతి భవన్ ముందు ఉన్న కంచెను తీసేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటై..సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన దగ్గరి నుండి ప్రగతి భవన్ వద్ద ఆంక్షలు చేపట్టారు. కొన్ని రోజుల తర్వాత అక్కడ భారీ కంచెలను ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేసారు. సామాన్య ప్రజలు లోనికి వెళ్లకుండా గట్టి భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ధర్నాలు, ఆందోళనలు అడ్డుకునేందుకు ఈ కంచె ఏర్పాటు చేశారని అప్పట్లో ప్రతిపక్షాలు, ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. కానీ, కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు నిర్భయంగా ప్రగతి భవన్ కు రావొచ్చని.. తమ ఫిర్యాదులను సీఎంకు చెప్పే స్వేచ్ఛ ఉందని రేవంత్ రెడ్డి తెలపడంతో కంచె తొలగింపు పనులు ప్రారంభం అయ్యాయి. ఈ కంచెను తొలగించడం వల్ల.. ఆ రూట్లో వెళ్లే వాహన దారులకు కొంత ఉపశమనం లభిస్తుంది. మరోవైపు, ప్రగతి భవన్ ముందున్న బ్యారికేడ్స్ లోపలి నుంచి ట్రాఫిక్ కు పోలీసులు అనుమతి ఇచ్చారు. బ్యారికేడ్స్ తొలగింపుతో ట్రాఫిక్ కు పర్మిషన్ ఇచ్చారు. ట్రాఫిక్ పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈ చర్య కొనసాగుతుంది. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా బ్యారికేడ్లను తొలగించనున్నారు.

Read Also : Revanth Reddy Cabinet Ministers : ఏ జిల్లా నుంచి ఎవరెవరు మంత్రులవుతున్నారంటే ..