Pubs : ఇటీవల పబ్‌లలో డ్రగ్స్ వాడకం భారీగా పెరిగిపోయింది. దీంతో హైదరాబాద్(Hyderabad)లో డ్రగ్స్‌ను ఆరికట్టేందుకు పోలీసులు(police) కఠిరంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా సిటీలోని పలు పబ్ లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన 12 బృందాలు పాల్గొన్నాయి. స్పాట్ డ్రగ్ టెస్టుల ద్వారా అనుమానితులను పరీక్షించారు. సుమారు 50 మంది అనుమానితులలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్భంగా పబ్ యజమానులకు( pub owners) అధికారులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పబ్ కు వచ్చే కస్టమర్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతించాలని సూచించారు. అదేవిధంగా, పబ్ యాజమాన్యం కానీ, పబ్ లో పనిచేసేవాళ్లు కానీ.. ఎవరైనా డ్రగ్ సంబంధిత నేరాలకు పాల్పడితే పబ్ లైసెన్స్ రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
కాగా, దాదాపు రాత్రి 10 గంటలకు ప్రారంభమైన దాడులు తెల్లవారుజామున 1 గంటల వరకు కొనసాగాయి. ఈ సమయంలో, అధికారులు అక్కడికక్కడే డ్రగ్ పరీక్షలను నిర్వహించడానికి 12-ప్యానెల్ డ్రగ్ డిటెక్షన్ కిట్‌లను ఉపయోగించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ దాడులు జరిగాయి. జాయింట్ కమిషనర్ ఖురేషి, అసిస్టెంట్ కమిషనర్లు కిషన్, అనిల్ కుమార్ రెడ్డి, అదనపు ఎస్పీ భాస్కర్ ఈ దాడులను పర్యవేక్షించారు. ఇలాంటి ఆకస్మిక దాడులు కొనసాగుతాయని, బార్‌లు, పబ్‌లలో డ్రగ్స్ తాగితే కఠిన చర్యలు తీసుకుంటామని కమలాసన్ రెడ్డి హెచ్చరించారు.
Read Also: CM Siddaramaiah : సిద్ధరామయ్య న్యాయపోరాటం, రేపటి నుంచి మంత్రాలయ పర్యటన రద్దు