Police Impose Many Restrictions : సీఎం రేవంత్ ఇంటివద్ద పోలీసుల అత్యుత్సాహం..మీడియా ఫై ఆంక్షలు

ఎందుకు వీడియో తీస్తున్నారంటూ మీడియా వారిని అక్కడినుండి పంపించే ప్రయత్నం చేసారు

Published By: HashtagU Telugu Desk

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అధికారం లోకి వచ్చిన దగ్గరి నుండి పోలీసుల అత్యుత్సాహం విపరితమైంది. సామాన్య ప్రజలకే కాదు మీడియా ఫై కూడా ఆంక్షలు విధిస్తున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వెళ్లిన మీడియా ఫై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ..కవరేజ్ చేయకుండా అడ్డుకుంటున్నారు. ఎందుకు నెట్టివేస్తున్నారని..ప్రశ్నిస్తే..అంతే అన్నట్లు సమాధానం చెపుతున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఇదే జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

బుధువారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు గురుకుల అభ్య‌ర్థులు నిర‌స‌న‌కు దిగారు. మొత్తం 9,120 పోస్టుల‌ను డిసెండింగ్ ఆర్డ‌ర్‌( Descending order) లో భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేసారు. నిరుద్యోగుల బాధ‌ల‌ను ఆల‌కించాల‌ని వారంతా వాపోయారు…ప్రస్తుతం సీఎం అందుబాటులో లేకపోవడం.. సీఎం ఇంటి వ‌ద్ద నిర‌స‌న‌కు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో గురుకుల అభ్య‌ర్థులు పెద్ద‌మ్మ గుడి వ‌ద్ద భిక్షాట‌న చేస్తూ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. దీనిని మీడియా వారు కవర్ చేస్తుండగా..పోలీసులు అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎందుకు వీడియో తీస్తున్నారంటూ మీడియా వారిని అక్కడినుండి పంపించే ప్రయత్నం చేసారు. మీడియా ను ఎందుకు నెట్టివేస్తున్నారు అని ప్రశ్నించిన అంతే..అన్నట్లు వారు సమాధానం చెప్పారు. దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఫలితాల ముందు వరకు మీడియా కు పెద్ద పీఠం వేస్తామని తెలిపిన ప్రభుత్వం..ఈరోజు అదే మీడియా ను దూరం పెడుతుందని..ప్రశ్నిస్తే కేసులు పెడుతుందని..ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడుతుందని మీడియా వారు వాపోతున్నారు.

Read Also : Free Bus Travel to Women : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ మంత్రి క్లారిటీ

  Last Updated: 26 Jun 2024, 02:09 PM IST