Revanth Reddy: ఇసుక దోపిడీదారులను తెలంగాణ పొలిమేరల దాకా తరిమికొట్టాలి: రేవంత్

దోపిడీని బాహ్య ప్రపంచానికి చూపించేందుకే ఇసుక ప్రాంతాలను సందర్శించానని రేవంత్ అన్నారు.

Published By: HashtagU Telugu Desk
Revanth Reddy

Revanth Reddy

బీఆరెస్ నాయకులు (BRS Leaders) సాండ్, ల్యాండ్, మైన్ లను ఆదాయ వనరుగా చేసుకున్నారని, ఇసుక దోపిడీకి పాల్పడుతూ అడ్డు వచ్చిన వారిని అంతమొందిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. జోగినపల్లి సంతోష్, అతని తండ్రి రవీందర్ రావు బినామీ పేర్లతో వందల కోట్ల దోపీడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఒకే పర్మిట్ తో నాలుగు లారీల్లో ఇసుక తరలిస్తున్నారని, ఈ దోపిడీని బాహ్య ప్రపంచానికి చూపించేందుకే ఇసుక ప్రాంతాలను సందర్శించానని రేవంత్ అన్నారు.

ఇసుకను తీయడానికి జేసీబీలను ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధమని, అధికారులతో చర్చిద్దామనుకుంటే ఒక్క అధికారి కూడా అందుబాటులో లేరని, ఇసుక డంప్ లు ఉన్న ఈ ప్రాంతాన్ని అధికారులు పర్యవేక్షించాలి రేవంత్ (Revanth Reddy) డిమాండ్ చేశారు. ఇది ఒక ప్రయివేటు సామ్రాజ్యంగా మారిందని, ఇసుక తరలింపును అడ్డుకున్నవారిని పోలీసులు హెచ్చరించకుడా మౌనంగా ఉంటున్నారని ఆయన అన్నారు. పోలీసులు ఇసుక మాఫియా చేతిలో కీలుబొమ్మలుగా మారాందని, పిర్యాదు చేసిన వారిపైనే వారు చర్యలకు పాల్పడుతున్నారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.

ఈ దోపిడీతో కేసీఆర్ కు ఉన్న చీకటి అనుబంధం ఏమిటో తేలాలని, ఇలాగే సాగితే ఇక్కడి ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దోపిడీకి వ్యతిరేకంగా… ప్రభుత్వ అక్రమ అనుమతులు రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని, ఇప్పటికైనా ఈటెల, బండి సంజయ్ ఈ దోపిడీపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్నా బీజేపీ స్పందించడం లేదంటే.. బీఆరెస్, బీజేపీ బంధాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: Raja Singh Demand: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను : రాజాసింగ్ సంచలనం!

  Last Updated: 01 Mar 2023, 03:53 PM IST