ధూల్ పేట‌లో `మ‌త్తు`పై కౌన్సిలింగ్

  • Written By:
  • Publish Date - October 18, 2021 / 03:21 PM IST

గంజాయి, హెరాయిన్ ఇత‌ర మ‌త్తు ప‌దార్థాల‌కు బానిస‌లైన పిల్ల‌ల‌కు ధూల్ పేట ఎక్సైజ్ అధికారుల వినూత్న కౌన్సిలింగ్ ప్రక్రియ‌ను ఎంచుకున్నారు. క్లీనిక‌ల్ సైకాలజిస్ట్ ద్వారా గంజాయి మ‌త్తుకు దూరంగా చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నిషా ముక్త్ భార‌త్ కార్య‌క్ర‌మంలో భాగంగా ధూల్ పేట అధికారులు కౌన్సిలింగ్ నిర్వ‌హిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 21 నుంచి అక్టోబ‌ర్ 21 మ‌ధ్య కాలంలోనే 410 మంది పిల్ల‌ల్ని గుర్తించారు. వీళ్లంద‌రూ వ‌య‌సులో 18 నుంచి 25 మంది ఉన్న‌ట్టు ధూల్ పేట ఎక్సైజ్ సూప‌రిండెంట్ న‌వీన్ కుమార్ వెల్ల‌డించాడు.
పోలీసులు, స్థానికుల‌తో ఎక్సైజ్ శాఖ స‌మ‌న్వ‌యం చేసుకుంటోంది. మ‌త్తు ప‌దార్థాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న ప్రాంతాల‌ను గుర్తిస్తున్నారు. వినియోగ‌దారులు ఎవ‌రు అనే విష‌యాన్ని కొనుగొంటున్నారు. ఎక్క‌డ నుంచి గంజాయి స‌ర‌ఫ‌రా అవుతోంద‌నే విష‌యాన్ని ఆరా తీస్తున్నారు. ఎక్సైజ్ కార్యాల‌యంలోని గ‌దుల నిండా సీజ్ చేసిన గంజాయి ఉంది. అలాగే, గంజాయి తాగకుండా ఉండలేని పిల్ల‌ల‌ను గుర్తించి ప్ర‌త్యేక కౌన్సిలింగ్ సెంట‌ర్ ఏర్పాటు చేశారు.
కౌన్సిలింగ్ ద్వారా పిల్ల‌లు శారీక‌ర‌కంగా, మాన‌సికంగా ఎలా న‌ష్ట‌పోతున్నార‌నే విష‌యాన్ని క్లినిక‌ల్ కౌన్సిలింగ్ ద్వారా వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ప్ర‌త్యేకించి లైంగిక స‌మ‌స్య‌లు, పిల్ల‌లు ప‌ట్ట‌క‌పోవ‌డం, బ‌ల‌హీన‌ప‌డ‌డం, మ‌తి స్థిమితం కోల్పోవ‌డం త‌దిత‌రాల‌ను గ‌మ‌నించారు. గంజాయి తాగితే జీవితంలో ఎదుర‌య్యే ప్ర‌మాదాల‌పై అవ‌గాహ‌న పెంచే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. లైంగిక స‌మ‌స్య‌లు, పిల్లలు పుట్ట‌క‌పోవ‌డం అంశాల‌ను కౌన్సిలింగ్ కు వ‌చ్చిన మ‌త్తు బానిస‌లు సీరియ‌స్ గా వింటున్నార‌ని సైకాలిజిస్ట్ గ‌మ‌నించారు.
మ‌త్తుకు బానిస‌లైన పిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌ను కూడా కౌన్సిలింగ్ కు తీసుకొచ్చారు. ఎలాంటి ప‌రిస్థితుల్లో గంజాయి తాగుతున్నారనే విష‌యాన్ని ఆరా తీస్తున్నారు. మాన‌సిక స్థిమిత లేని వాళ్ల‌ను ఎర్ర‌గ‌డ్డ మెంట‌ల్ ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తున్నారు. అక్క‌డి వైద్యుల స‌ల‌హాలు, సూచ‌న‌ల మేర‌కు చికిత్స అందించే ప్ర‌య‌త్నం ధూల్ పేట్ ఎక్సైజ్ అధికారులు చేస్తున్నారు. గంజాయి లేక‌పోతే. మ‌తిస్థిమితం కోల్పోతోన్న పిల్ల‌ల‌ను కూడా గ‌మనించారు. అలాంటి వాళ్ల‌కు ప్ర‌త్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గంజాయి ప్ర‌భావం చిన్నారుల మీద ఎక్కువ‌గా న‌ష్టం చేకూర్చుతుంది. అందుకే,
కేంద్రం సూచ‌న‌ల మేర‌కు నిషా ముక్త్ భార‌త్ కార్య‌క్ర‌మాన్ని సీరియ‌స్ గా తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.