జన్వాడ ఫామ్‌హౌస్‌లో ఇటీవల జరిగిన పార్టీ (Janwada Party Issue) వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై అధికార కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ (Congress Vs BRS) మధ్య తీవ్ర మాటల యుద్ధం నడుస్తుంది. ఇరు పార్టీల నాయకులు పరస్పరం సవాళ్లతో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.
ఈ పార్టీ కేసులో ప్రధాన సూత్రధారి , A2 గా ఉన్న రాజ్ పాకాల (Raj Pakala) ఈరోజు పోలిసుల విచారణ కు హాజరయ్యారు. ఈ విచారణలో, ఆయన్ని జన్వాడ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి మోకిల పోలీసులు సుదీర్ఘంగా, రెండు గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. అయితే, అనుమానాస్పద ఆధారాలు లభించకపోవడంతో రాజ్ పాకాలను తిరిగి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. విజయ్ మద్దూరి స్టేట్‌మెంట్ ఆధారంగా రాజ్ పాకాలను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో రాజ్ పాకాల ఫోన్‌కు సంబంధించి కూడా ఆరా తీస్తున్నారు.
శనివారం రాత్రి జన్వాడలోని రిజర్వ్ కాలనీలోని తన ఫామ్‌హౌస్‌లో రాజ్ పాకాల పార్టీ నిర్వహించారు. ఈ పార్టీ ఫై పిర్యాదులు అందడం తో పోలీసులు ఫామ్‌హౌస్‌కు చేరుకుని సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులు మద్యం పార్టీ నిర్వహించారు. దాంతో పోలీసులు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు తేలింది. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఈరోజు విచారణకు హాజరయ్యారు.
Read Also : Virat Kohli Captain: విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరోసారి కెప్టెన్‌గా!