Site icon HashtagU Telugu

Telangana: మంత్రి హరీష్‌రావు కాన్వాయ్‌ని తనిఖీ చేసిన పోలీసులు

Telangana (64)

Telangana (64)

Telangana: తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బు, నగలు, మద్యం పట్టుబడుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత స్పీడ్ పెంచారు. ఓటర్లకు డబ్బు, మద్యం వంటివి రాజకీయ నాయకులు పంపిణీ చేయకుండా పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా మంత్రి హరీష్ రావు కాన్వాయ్ ని పోలీసులు అడ్డుకున్నారు.

మంగళవారం సాయంత్రం వేళ మంత్రి హరీశ్ రావు కాన్వాయ్‌ని పోలీసులు తనిఖీ చేశారు. సిద్దిపేట జిల్లా పొన్నాల ప్రధాన రహదారి వద్ద ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న పోలీసులు మంత్రి హరీశ్ రావు కాన్వాయ్‌ని అడ్డగించారు. కాన్వాయ్ మొత్తం తనిఖీ చేశారు. ఈ మేరకు మంత్రి హరీష్ రావు పోలీసులకు పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు తనిఖీ చేశారు. పోలీసుల తనిఖీకి సహకరించిన హరీష్ కి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.

Also Read: CM KCR: నవంబర్ 2న ధర్మ పురిలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ

Exit mobile version