Site icon HashtagU Telugu

Drugs : నల్గొండ లో రూ.5 కోట్ల 10 లక్షల విలువ చేసే గంజాయిని తగలబెట్టిన పోలీసులు

Police Burn Drugs

Police Burn Drugs

మాదక ద్రవ్యాల (Drugs) విషయంలో తెలంగాణ సర్కార్ (Telangana Govt) చాల కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ , గంజాయి వంటి మాదక ద్రవ్యాలు రాష్ట్రంలో కనిపించకూడదు , వినిపించకూడదని అధికారంలోకి రాగానే పోలీసులకు, ఆ శాఖా అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. దీంతో హైదరాబాద్ నగరం తో పాటు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అరా తీయడం..తనిఖీలు చేయడం చేస్తున్నారు. ఈ క్రమంలో నల్గొండ (Nalgonda) లో ఇటీవల దొరికిన దాదాపు రూ.5 కోట్ల 10 లక్షల విలువ చేసే గంజాయిని పోలీసులు తగలబెట్టారు. మొత్తం 39 కేసుల్లో ఈ గంజాయిని సీజ్ చేసినట్లు వెల్లడించిన ఎస్పీ, ఎవరైనా మత్తు పదార్థాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

We’re now on WhatsApp. Click to Join.

కోర్టు ఉత్తర్వుల ప్రకారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ అధ్వర్యంలో రూ.5.10 కోట్ల విలువ చేసే మొత్తం 2,043 కిలోల గంజాయిని కాల్చి బూడిద చేశారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నెపర్తి పోలీస్ ఫైరింగ్ రేంజ్‌ వద్ద గంజాయిని కాల్చేశారు. 39 కేసుల్లో సీజ్ చేసిన మెుత్తం 2043 కిలోల గంజాయిని నేడు తగులబెట్టినట్లు ఎస్పీ చందనా దీప్తి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గంజాయి అక్రమ రవాణాపై నిరంతర నిఘా ఉంటుందని, మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పని చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఎవరైనా గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read Also : Bank Holidays in May 2024 : మే నెలలో బ్యాంకులకు ఏకంగా 12 రోజులులు సెలవులు