Site icon HashtagU Telugu

Madhuyashki : మధుయాష్కీ నివాసంలో సోదాలు.. హయత్‌నగర్‌లో ఉద్రిక్తత

Madhuyashki

Madhuyashki

Madhuyashki : మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఉద్రిక్తత ఏర్పడింది. అకస్మాత్తుగా పోలీసులు హయత్‌నగర్‌లోని ఎల్బీ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి  మధుయాష్కీ గౌడ్ నివాసంలో సోదాలు చేశారు. పోలీసుల బృందం ఒక్కసారిగా ఆయన ఇంట్లోకి ప్రవేశించి తనిఖీలు చేసింది. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండానే పోలీసులు మధుయాష్కీ ఇంట్లో తనిఖీలు చేసేందుకు  వచ్చారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి.

We’re now on WhatsApp. Click to Join.

మధుయాష్కీ నివాసంలో పెద్ద ఎత్తున డబ్బు ఉందన్న సమాచారం అందడంతో పోలీసులు రైడ్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మధుయాష్కీ.. ‘‘కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? సెర్చ్ వారెంట్ ఏది? చూపించండి’’ అంటూ పోలీసులను నిలదీశారు. సమాచారం అందుకున్న కాంగ్రెస్ శ్రేణులు మధుయాష్కీ నివాసం వద్దకు చేరుకున్నారు. దీంతో అర్ధరాత్రి హయత్‌నగర్‌లో టెన్షన్ వాతావరణం(Madhuyashki) నెలకొంది.

Also Read: India vs New Zealand: నేడే భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్.. కివీస్ పై టీమిండియా రివెంజ్ తీర్చుకుంటుందా..?